📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rajnath Singh: ఉగ్ర‌వాదంతో ఎటువంటి విప్ల‌వం పుట్టదు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

Author Icon By Sudha
Updated: July 29, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపుల‌కు తామేమీ తలొగ్గ‌మ‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ (Rajnath Singh)అన్నారు. ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదం (Terrorism) నిర్మూల‌న అంశంలో పాకిస్థాన్‌కు స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఉగ్ర‌వాదంతో ఎటువంటి విప్ల‌వం పుట్ట‌ద‌ని, కేవ‌లం విధ్వంసం, విద్వేషం మాత్ర‌మే మిగులుతాయ‌న్నారు. ఉగ్ర‌వాదానికి భార‌త్ వ్య‌తిరేక‌మ‌న్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేష‌న్ సింధూర్ సంకేతంగా నిలుస్తుంద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వాలు ద‌శాబ్ధాల క్రిత‌మే ఇలాంటి చ‌ర్య‌ల‌ను చేయాల్సి ఉండే అని రాజ్‌నాథ్ (Rajnath Singh) అన్నారు. ఒక‌వేళ పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని రూపుమాపాల‌నుకుంటే, ఆ దేశానికి స‌హ‌కారం అందించేందుకు భార‌త్‌ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు ఒకేసారి స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జరుపుకుంటాయ‌ని, కానీ పాకిస్థాన్‌ను ఉగ్ర‌వాద కేంద్రంగా భావిస్తున్నార‌ని, ఇండియాను మాత్రం ప్ర‌జాస్వామ్యానికి త‌ల్లిగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉగ్ర‌వాదులేమీ ఫ్రీడం ఫైట‌ర్లు కాద‌న్నారు.

Rajnath Singh: ఉగ్ర‌వాదంతో ఎటువంటి విప్ల‌వం పుట్టదు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో పాకిస్థాన్ ఎన్ని యుద్ధ విమానాల‌ను కోల్పోయిద‌న్న విష‌యాన్ని విప‌క్షాలు ఎందుకు అడ‌గ‌డం లేద‌న్నారు. కానీ భార‌తీయ యుద్ధ విమానాల గురించి మాత్ర‌మే ప్ర‌శ్న వేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఏదో ఒక రోజు పీవోకే ప్ర‌జ‌లు ఇండియాతో క‌లుస్తార‌ని, భార‌తీయుల‌మ‌ని చెప్పుకునేందుకు వాళ్లు గ‌ర్వ‌ప‌డుతార‌ని రాజ్‌నాథ్ (Rajnath Singh)అన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌కు కేవ‌లం కామా మాత్ర‌మే పెట్టామ‌ని, ఫుల్ స్టాప్ పెట్ట‌లేద‌న్నారు. కాల్పుల విర‌మ‌ణకు ఎందుకు అంగీక‌రించార‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ.. ఆప‌రేష‌న్ సింధూర్ ల‌క్ష్యం కేవ‌లం పాకిస్థాన్‌ను శిక్షించ‌డ‌మే అని, కానీ ఆ దేశంపై యుద్ధం చేయ‌డం త‌మ ఉద్దేశం కాద‌న్నారు. పాకిస్థాన్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావ‌రాల‌పై ఇండియా దాడి చేసింద‌ని, ఆ దాడిలో ఒక్క పాకిస్థానీ పౌరుడు కూడా మ‌ర‌ణించ‌లేద‌ని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

రాజ్‌నాథ్ సింగ్ అర్హతలు?

ఆయన రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తన గ్రామంలోని స్థానిక పాఠశాల నుండి ప్రాథమిక విద్యను పొందారు మరియు గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ డివిజన్ ఫలితాలను పొంది, భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. బాల్యం నుండి ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలంతో ప్రేరణ పొందారు.

రాజ్‌నాథ్ సింగ్ భద్రతా వర్గం ఏమిటి?

Y కేటగిరీలో ఇద్దరు వ్యక్తిగత భద్రతా అధికారులు (PSOలు) మరియు X కేటగిరీలో ఒకరు PSO ఉన్నారు.

రక్షణ మంత్రి ఏమి చేస్తారు?

రక్షణ మరియు భద్రతా సంబంధిత విషయాలపై విధాన ఆదేశాలను రూపొందించడం మరియు వాటిని అమలు కోసం సేవల ప్రధాన కార్యాలయాలు, ఇంటర్-సర్వీస్ సంస్థలు, ఉత్పత్తి సంస్థలు మరియు పరిశోధన & అభివృద్ధి సంస్థలకు తెలియజేయడం మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన విధి. సమర్థవంతమైన అమలును నిర్ధారించడం అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Narendra Modi : మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరగలేదు :

India Defence Indian Parliament nuclear weapons Pakistan threat Rajnath Singh Telugu News Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.