📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్

Author Icon By Divya Vani M
Updated: August 2, 2025 • 8:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓటర్ల విషయంలో “అణుబాంబు పేలుస్తాం” అన్న వ్యాఖ్య చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సమాధానం ఇచ్చారు. రాహుల్ మాటలపై ఆయన ఎద్దేవా చేస్తూ, అణుబాంబు ఉందని చెబుతున్నారు, అయితే వెంటనే పేల్చండి, అన్నారు.రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇలాగే గతంలో భూకంపం వస్తుందని కూడా హెచ్చరించారు. కానీ ఆ తర్వాత అది తుస్సుమని పేలిపోయింది, అని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు కేవలం సంచలనానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఆయన సూచించారు.ప్రతిపక్ష నేతగా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.

Rahul Gandhi : రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది.ఈ ప్రక్రియను రాహుల్ గాంధీ ప్రారంభం నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యల సారాంశం

రాహుల్ గాంధీ చేసిన “అణుబాంబు” వ్యాఖ్యను ఆయన పూర్తిగా నిరాధారమని అభివర్ణించారు. “దాని వల్ల ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి, అంటూ వ్యంగ్యంగా సూచించారు. రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.బీహార్‌లో ఎన్నికల జాబితా సవరణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Read Also : Allu Arjun : షారుక్ ఖాన్, రాణి ముఖర్జీకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు

Bihar Elections Election Commission nuclear bomb remark rahul gandhi Rajnath Singh voter list controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.