📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Rahul Gandhi: లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

Author Icon By Anusha
Updated: February 2, 2026 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. సోమవారం జరిగిన ఈ చర్చలో రాహుల్ గాంధీ డోక్లామ్ అంశాన్ని ప్రస్తావించడంతో సభ వాతావరణం ఒక్కసారిగా గందరగోళం నెలకుంది.. ఆర్మీ మాజీ చీఫ్ ముకుంద్ నరవాణే రాసిన పుస్తకంలోని ఓ వ్యాక్యాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read Also: Tamil Nadu: టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

Rajnath objects to Rahul’s remarks in Lok Sabha

ఎంపీలు నిరసన

రాహుల్ (Rahul Gandhi) చెప్పిన పుస్తకం ఎక్కడుంది అని స్పీకర్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించవద్దని, పుస్తకం ప్రామాణికత చెప్పాలని పేర్కొన్నారు. సభలో పేపర్ కటింగ్స్, ప్లకార్డులు, ఫ్లేక్సీలు ప్రదర్శించడం నిషేధమని స్పీకర్ వ్యాఖ్యానించారు. సబ్జెక్ట్ మాట్లాడాలంటూ రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు తమ సీట్ల నుంచి లేచి నిరసన తెలిపారు. రాహుల్ మాట్లాడుతుండగా, దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ,

ప్రచురణ కాని పుస్తకం నుంచి వ్యాఖ్యలు చేయడం హౌస్ రూల్స్‌ను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ వాదనను అధికార పక్షం వ్యతిరేకించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మ్యాగజైన్ లేదా వార్తాపత్రికల ఆర్టికల్స్‌ను సభ్యులు ప్రస్తావించరాదని అన్నారు. అయితే, ఇండో-చైనా సంబంధాలపై మాట్లాడే హక్కు తనకు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభను 3 గంటల వరకు వాయిదా వేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Lok Sabha Om Birla Parliament Budget Session rahul gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.