📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Rajiv Shukla: కోహ్లీ, రోహిత్‌ రిటైర్మెంట్ పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన అంశం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ (Test series) కు ముందే మే 2025లో వీరి రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానుల మధ్య అనేక అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా, ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఒత్తిడి ఉందన్న ప్రచారం కూడా వెలువడింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలను ఖండించారు.కోహ్లీ, రోహిత్ తమ స్వంత నిర్ణయంతోనే టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పారు. బీసీసీఐ (BCCI) ఎప్పుడూ ఆటగాళ్లను రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఒత్తిడి చేయదు. ఇది మా పాలసీ కాదు. వారి సేవలను మేము మిస్ అవుతాం, కానీ నిర్ణయం వారి దే” అని ఆయన స్పష్టం చేశారు.

బీసీసీఐ యువతపై దృష్టి పెట్టేందుకు

రోహిత్ శర్మ మే 7న, విరాట్ కోహ్లీ మే 12న సోషల్ మీడియాలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అయితే, మైకేల్ క్లార్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ“ఇంగ్లండ్ టూర్‌కి సిద్ధమవుతున్నా” అని చెప్పిన విషయం, ఆ తరువాత రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో బీసీసీఐ యువతపై దృష్టి పెట్టేందుకు వీరి సేవలను అణిచివేసిందన్న ఆరోపణలు వినిపించాయి.ముఖ్యంగా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఒత్తిడి చేసి మరి కోహ్లీ, రోహిత్ తప్పుకునేలా చేశాడని వార్తలు వచ్చాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా, ఈ వార్తలను కొట్టిపారేసారు. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. రిటైర్మెంట్ ప్రకటించాలని ఏ ఆటగాడికి కూడా బీసీసీఐ చెప్పదు, అది బోర్డు పాలసీ కూడా కాదని స్పష్టం చేశారు.

న్యూస్ ఏజెన్సీ

ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ, రోహిత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రిటైర్మెంట్ వారి వ్యక్తిగత నిర్ణయం.రోహిత్, కోహ్లీ గొప్ప బ్యాటర్లు. వారిని మిస్సవుతూనే ఉంటాం. టెస్ట్‌లకు వీడ్కోలు పలికినా వన్డేలకు అందుబాటులో ఉండటం సంతోషించే విషయం. శుభ్‌మన్ గిల్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాటు దేలుతున్నాడు.’అని రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఓ న్యూస్ ఏజెన్సీతో అన్నాడు. టీమిండియా ఆటగాళ్లతో కలిసి రాజీవ్ శుక్లా, బ్రిటన్ కింగ్ చార్లెస్-3ని మర్యాద పూర్వకంగా కలిసారు. లండన్‌లోని క్లారెన్ హౌస్ గార్టెన్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత ఆటగాళ్లతో కింగ్ చార్లెస్ సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా చార్లెస్‌కు రాజీవ్ శుక్లా బుక్‌ను గిప్ట్ కూడా ఇచ్చారు.

రాజీవ్ శుక్లా బీసీసీఐ కెరీర్?

రాజీవ్ శుక్లా (జననం 13 సెప్టెంబర్ 1959) ఒక భారతీయ రాజకీయవేత్త, మాజీ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్. 2015లో, ఆయనను BCCI ఏకగ్రీవంగా IPL ఛైర్మన్‌గా తిరిగి నియమించింది. 2020 డిసెంబర్ 18న, ఆయన BCCI ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఏది?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారతదేశంలో క్రికెట్ క్రీడకు ప్రధాన జాతీయ పాలక సంస్థ . దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాంఖడే స్టేడియంలోని క్రికెట్ సెంటర్‌లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sourav Ganguly: టాపార్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓడింది

BCCI pressure on players Breaking News Gautam Gambhir controversy latest news Rajeev Shukla statement Rohit Sharma Test Cricket virat kohli test retirement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.