సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) 75వ జన్మదినాన్ని ఈ రోజు పురస్కరించుకుంటున్నారు. ఈ సందర్బంగా, ఆయనతో చాల్‌బాజ్ (1989) చిత్రంలో పనిచేసిన దర్శకుడు పంకజ్ పరాశర్ అప్పటి అందమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. రజనీకాంత్ నటనపై, వినయంపై, స్టార్‌డమ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పరాశర్ మాట్లాడుతూ
“రజనీకాంత్ అసాధారణమైన తెలివి గల నటుడు. ‘చాల్‌బాజ్’ ప్రధానంగా శ్రీదేవి కోసం రూపొందించిన సినిమా అని వెంటనే అర్థం చేసుకున్నారు. కాబట్టి తన పాత్రను హీరోయిజం దిశగా కాకుండా, పూర్తిగా కామెడీ షేడ్‌లోకి మార్చుకోవాలని తానే స్వయంగా సూచించారు. భయపడే మనిషి పాత్ర చేయడానికి సిద్ధం కావడం వంటి నిర్ణయాలను పెద్ద స్టార్‌లు తీసుకోవడం అరుదు” అని తెలిపారు. సెట్లో శ్రీదేవి వచ్చినప్పుడల్లా రజనీకాంత్ నవ్వుతూ ‘శ్రీదేవా’ అని పలకడం ఇప్పటికీ జ్ఞాపకమంటూ అన్నారు.
Read also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
అలాగే రజనీకాంత్ నిరాడంబరత గురించి మాట్లాడిన ఆయన
“అసిస్టెంట్, మేనేజర్ ఎవరూ ఉండరు. పాత 1960ల ఫియట్ కారులో సెట్కు వచ్చేవారు. ఒకసారి నన్ను హోటల్‌కు వదిలి పెట్టడానికి కూడా ముందుకొచ్చారు. ఎసీ లేని కారులో కిటికీ దిగితే అభిమానులు గుమికూడి గందరగోళం అవుతుందని చెప్పారు. నేను నమ్మలేదు. కానీ సిగ్నల్ దగ్గర కొద్దిసేపట్లోనే జనాలు చుట్టుముట్టి ట్రాఫిక్ జామ్ చేశారు. అప్పుడు ఆయన స్టార్‌డమ్ ఎంత విస్తృతమో నాకు అర్థమైంది” అని వివరించారు.
అతిశయమైన అభిమానంతో తనకు గర్వం రాకుండా ఉండేందుకు రజనీకాంత్ చేసే పాట్లు కూడా పంచుకున్నారు. “ప్రజలు నన్ను దేవుడిలా చూసే సందర్భాలు ఉంటాయి. అవి తలకెక్కకుండా ఉండేందుకు కొన్నిసార్లు పర్వత ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో 10–12 రోజులు గడుపుతాను. నేలను శుభ్రం చేయడం, నేలమీదే పడుకోవడం వంటి పనులు నన్ను వినయంగా ఉంచుతాయి” అని రజనీకాంత్ తనకు చెప్పారని వెల్లడించారు.
ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి గాను జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: