Rajasthan: రాజస్థాన్ లో విషాదసంఘటన జరిగింది. ఓ స్కూల్ పై కప్పు కూలి పోవడంతో ఐదుగురు చిన్నారులు మరణించారు. శిథిలాలకింద మరో 60 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. స్కూలు భవనం శిథిలావస్థకు చేరుకున్నా.. అధికారులు ఈ భవనాన్ని వాడడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం (Friday morning) రాజస్థాన్ (Rajasthan) లోని ఝాలవర్ (Jhalawar) లోని ఓ స్కూల్ లో వందలాదిమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హఠాత్తుగా స్కూల్ పైకప్పు కూలిపోవడంతో స్పాట్లోనే ఐదుగురు చిన్నారులు మరణించారు. శిథిలాల కింద 60 మంది పిల్లలు చిక్కుకునిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది చిన్నారులకు తీవ్రమైన గాయాలు అయినట్లుగా తెలుస్తున్నది.
రాజస్థాన్‌లో స్కూల్ పైకప్పు కూలిన ఘటన ఎక్కడ జరిగింది?
ఈ ఘటన ఝాలవర్‌లోని ఓ స్కూల్‌లో జరిగింది, అక్కడ ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
ఘటన సమయంలో విద్యార్థులకు ఏమయ్యింది?
పైకప్పు కూలడంతో 60 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Narendra modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు