📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajasthan: పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని కిడ్నాప్.. ఎందుకంటే..?

Author Icon By Saritha
Updated: February 24, 2026 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajasthan: రాజస్థాన్‌లోని జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లా జైసర్ గ్రామంలో బోర్డు పరీక్ష రాయడానికి వచ్చిన ఒక విద్యార్థిని పట్టపగలు కిడ్నాప్ చేశారు. కొంతమంది యువకులు ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం వెలుపల బలవంతంగా కారులోకి ఎక్కించి, తరువాత అతనిపై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. 

సోమవారం (ఫిబ్రవరి 23) జైసర్‌లోని పరీక్షా కేంద్రానికి విద్యార్థి నిర్ణీత సమయానికి చేరుకున్నాడు. ఇంతలో, కొంతమంది యువకులు వచ్చి విద్యార్థిని బలవంతంగా పట్టుకుని కారులో తీసుకెళ్లారు. ఈ ఆకస్మిక సంఘటన పరీక్షా కేంద్రంలో గందరగోళానికి దారితీసింది. సంఘటన స్థలంలో ఉన్న స్థానికుడు ఈ మొత్తం సంఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.

Read also: Musk: చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

Rajasthan: Student who came to write an exam was kidnapped.. because..?

గోర్లు పీకేసి.. దంతాలు విరగ్గొట్టి దాడి

కిడ్నాప్ చేసి నిందితులు విద్యార్థిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అతడిపై క్రూరంగా దాడి చేశారు. దాడిలో విద్యార్థి దంతాలు విరిగిపోయాయి. నిందితులు క్రూరంగా విద్యార్థి వేళ్ల గోర్లను బయటకు పీకేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. కుటుంబ సభ్యులు బాధితుడిని వెంటనే బార్మర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు. వైరల్ వీడియో ఆధారంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నర్నారామ్, బజరంగ్ (నర్నారామ్ కుమారుడు), తేజ్‌పాల్, లక్ష్మణ్ నేరానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    పాత కక్షలే కారణమా?

    బార్మర్ అదనపు ఎస్పీ నితిన్ జి. ఆర్య ఈ ఘటనపై స్పందిస్తూ.. విద్యార్థికి, నిందితులకు మధ్య గతంలో ఉన్న శత్రుత్వమే ఈ దాడులకు కారణమని విచారణలో తెలిపారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రం వద్దే ఇలాంటి ఘటన జరగడంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

    Read hindi news: hindi.vaartha.com

    Epaper: epaper.vaartha.com

    Read also:

    Barmer Student Kidnap Board Exams Jaisar Village Rajasthan Crime News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.