ఏఐ కాలంలో జీవిస్తున్న మనం అంతరిక్షంలోనూ అవలీలగా పరిశోధనలు చేసి, ఎంతో అభివృద్ధిని సాధిస్తున్న మనం ఇంకా మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్నాం. మన నమ్మకాలకు పసిబిడ్డల్ని బలిచేస్తున్నాం. ఈ మూఢనమ్మకాల పిచ్చి ఎంతపీక్స్టేజీకి చేరింది అంటే ఏకంగా ఆరేళ్లపసిబాలుడినే బలి ఇచ్చేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉ
న్నాయి..రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని అల్వార్ జిల్లా సారైకళాన్ గ్రామంలో లోకేశ్ అనే ఆరేళ్ల బాలుడు ఈనెల 19వ తేదీన కనిపించకుండాపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. రాత్రి 8గంటల సమయంలో ఓపాడుబడ్డ ఇంట్లోబాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కనుగొన్నారు. శరీరంపై సూదులు గుచ్చినట్లుగా గుర్తులు ఉన్నాయి.
విచారణలో విస్తూపోయే విషయాలు..
దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. లోకేశ్ మేనమామ మనోజ్ కుమార్ ప్రవర్తన కాస్త తేడాకనిపించడంతో పోలీసులు ఆరాతీసారు. తొలుత మనోజ్కుమార్ కూడా బాలుడిని వెతుకుతున్నట్లుగా నటించాడు. అయితే,సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ప్రశ్నించడంతో మనోజ్కుమార్ నేరాన్ని అంగీకరించాడు. మనోజు (Manoj Kumar) అతడి భార్యకుమధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను ఇంటికి తిరిగి తీసుకుని రావాలనే కోరికతో సునీల్కుమూర్ అనే మాంత్రికుడిని సంప్రదించాడు. నరబలి ఇస్తే ఆమె తిరిగొస్తుందని మనోజ్కు సలహాఇచ్చాడు.
పూజల కోసం 12వేల నగదు
మాంత్రికుడు పూజల కోసం రూ. 12వేల నగదు, ఒక చిన్నారి రక్తం, కాలేయాన్ని బలి ఇవ్వాలని చెప్పాడు. అందుకు మనోజ్ తన మేనల్లుడిని ఎంచుకున్నాడు. జులై 19న మధ్యాహ్నం లోకేశ్కు చాక్లెట్ ఆశచూపి ఊరి చివర పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ గొంతునులిమి హత్య చేసి, సిరంజీలతో రక్తం తీసే ప్రయత్నం చేశాడు. అనంతరం శవాన్ని గడ్డివాము మధ్యదాచిపెట్టాడు. ఆ తర్వాత చిన్నారి కడుపుకోసం కాలేయం తీయడానికి మళ్లీ వచ్చేందుకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాంత్రికుడు సునీల్ (Sunil) ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి, జైలుకు తరలించారు. తన స్వార్థం కోసం మూఢత్వంతో చిన్నారి ప్రాణాలను బలిగొన్న ఇలాంటివారికి కఠినంగా శిక్షించాలనికుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
రాజస్థాన్‌ను ఎందుకు “రాజుల భూమి” (Land of Kings) అని పిలుస్తారు?
రాజస్థాన్ రాష్ట్రం గతంలో అనేక రాజవంశాలకు నిలయంగా ఉండింది. అక్కడ రాజులు నిర్మించిన విభూతిమంతమైన కోటలు, ప్యాలెస్‌లు రాజశక్తిని ప్రతిబింబిస్తాయి కాబట్టి దీనిని “రాజుల భూమి” అని పిలుస్తారు.
రాజస్థాన్ లో ఎలాంటి పండుగలు ప్రసిద్ధి?
కామేలా ఫెస్తివల్ (బికానీర్),డెజర్ట్ ఫెస్టివల్ (జైసల్మేర్),తీజ్, గంగూర్, దీపావళి, హోలీ – రంగుల విందు!
Read hindi news: hindi.vaartha.com
Read Also: Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు