📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Raja Raghuvanshi: సోదరుడి హత్యపై శ్రస్తి రఘువంశీ ఏమన్నారంటే?

Author Icon By Sharanya
Updated: June 12, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా రాజా భార్య సోనమ్ రఘువంశీ. ఈ నేపథ్యంలో రాజా సోదరి శ్రస్తి రఘువంశీ తన సోదరుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆమె రూపొందిస్తున్న వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వీటిపై కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించడంతో, ఆమెపై తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది.

సోషల్ మీడియాలో శ్రస్తి రఘువంశీకి ఎదురవుతున్న విమర్శలు

శ్రస్తి తన సోదరుడి మరణంపై అవగాహన కల్పిస్తూ, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. అయితే, కుటుంబ విషాదాన్ని ఆన్‌లైన్‌లో ప్రచారం పొందేందుకు వాడుకుంటున్నారని కొందరు నెటిజన్లు ఆమెపై ఆరోపణలు గుప్పించారు. ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇంతగా దిగజారాలా అంటూ మండిపడుతున్నారు.

శ్రస్తి వివరణ : “నేను మౌనంగా ఉండి ఉంటే హంతకులు దొరికేవారా?”

ఈ విమర్శలపై శ్రస్తి తాజాగా తీవ్రంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ – తాను మౌనంగా ఉండి ఉంటే, తన సోదరుడి హత్య కేసు రెండు మూడు రోజుల్లోనే మూతపడి ఉండేదని, హంతకుల జాడ కూడా దొరికేది కాదని ఆమె అన్నారు. “నా తమ్ముడి మరణాన్ని అడ్డుపెట్టుకుని ఫాలోవర్లను, వ్యూస్‌ను పెంచుకుంటున్నానని ఎవరైతే అంటున్నారో, అది నిజం కాదు. నేను పోస్టులు పెట్టి, అవి వైరల్ కాకపోయుంటే, బహుశా హంతకులు ఇంకా దొరికేవారు కాదేమో. మేం మౌనంగా ఉంటే ఈ కేసు రెండు మూడు రోజుల్లోనే మూసివేయబడేది. ఇలాంటి ఎన్నో కేసులు చూశాం – హంతకులు దొరికేవారు కాదు” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

“నా తమ్ముడి కోసం ఎవరితోనైనా పోరాడతా”

శ్రస్తి తన సోదరుడి కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. హత్యకు గురైన తన సోదరుడి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని శ్రస్తి స్పష్టం చేశారు. “ఎవరితో పోరాడాల్సి వచ్చినా, ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా, నా గొంతు అందరికీ చేరేలా చూస్తాను. దీనికి భిన్నంగా ఎవరు ఏమన్నా అది తప్పే. నన్ను అన్నిచోట్లా ట్రోల్ చేస్తున్నారని నాకు తెలుస్తోంది. కానీ మీరు నా సోదరుడి కోసం ఏం చేస్తున్నారు? నన్ను నిందిస్తున్నారు అంతే. కానీ ఓ సోదరి తన సోదరుడి కోసం ఎలా గొంతెత్తుతుందో మీరు ఆలోచించాలి. నాకు మద్దతు ఇవ్వాలి, సహాయం చేయాలి. కానీ మీరు నన్నే నిందిస్తున్నారు. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్రంగా వైరల్ అయిన ఆమె రీల్

ఇన్‌స్టాగ్రామ్‌లో 4,81,000 మంది ఫాలోవర్లు ఉన్న శ్రస్తి, తన సోదరుడు రాజా, సోనమ్‌ల వివాహ చిత్రాన్ని, ఓ వీడియోను నేపథ్యంగా ఉంచి సోనమ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఓ వీడియో పోస్ట్ చేయడంతో ఈ వ్యతిరేకత మొదలైంది. “నా సోదరుడు సోనమ్ రఘువంశీతో ఏడు జన్మల పాటు ఉంటానని ప్రమాణం చేశాడు, కానీ ఆమె ఏడు రోజులు కూడా అతనితో ఉండలేకపోయింది. ఇంత దారుణంగా చంపేంత తప్పు మా అన్న ఏంచేశాడు? నీకు వేరొకరు నచ్చితే అతడితో పారిపోవచ్చు కదా. మా అన్నను ఎందుకు చంపావు? ఒకరి సోదరుడిని, ఒకరి కుమారుడిని ఎందుకు దూరం చేశావు?” అంటూ శ్రస్తి కన్నీటిపర్యంతమయ్యారు.

Read also: Aadhaar: ఆధార్ ఉంటేనే తత్కాల్

#JusticeForRaja #murdercase #RajaRaghuvanshi #Shrastiraghuvanshi #SocialMediaReels Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.