📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Ajit Pawar Plane Crash : అజిత్ పవార్ మృతిపై రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: January 28, 2026 • 8:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపిన అజిత్ పవార్ అకాల మరణంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అత్యంత భావోద్వేగంతో స్పందించారు. అజిత్ పవార్ మృతి కేవలం ఒక రాజకీయ నాయకుడి మరణం మాత్రమే కాదని, ఒక నిజాయితీ గల వ్యక్తిత్వాన్ని రాష్ట్రం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉండటం, ఇచ్చిన మాటపై నిలబడటం వల్ల అజిత్ పవార్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వ్యక్తిగతంగా తాను కూడా అటువంటి పరిస్థితులనే అనుభవించానని ఠాక్రే తన ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు.

Elderly parents :వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా!

రాజకీయాల్లో వ్యూహాలు, మోసాలు సహజమైపోయిన నేటి కాలంలో, అజిత్ పవార్ తనదైన ముక్కుసూటి శైలిని చివరి వరకు కాపాడుకున్నారని రాజ్ ఠాక్రే ప్రశంసించారు. “హామీలు ఇచ్చి ప్రజలను లేదా తోటి నాయకులను మోసం చేయడం అజిత్ పద్ధతి కాదు. ఆ నిజాయితీ వల్లే ఆయన రాజకీయంగా ఎంతో మూల్యం చెల్లించుకున్నారు” అని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అజిత్ పవార్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూనే, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్తుత రాజకీయ ముఖచిత్రంతో పోల్చి చూపడం విశేషం.

కాగా, అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇది కేవలం ప్రమాదమేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవైపు రాజ్ ఠాక్రే ఆయన గుణగణాలను కొనిాడుతుంటే, మరోవైపు మమతా బెనర్జీ ఈ మరణం చుట్టూ ఉన్న అనుమానాలను లేవనెత్తడం ‘అజిత్ పవార్ మృతి’ ఉదంతాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Ajit pawar Ajit Pawar Plane Crash Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.