हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Raipur: అమ్మాయిలపై పోకిరీల దాడి రంగంలోకి దిగిన పోలీసులు

Sharanya
Raipur: అమ్మాయిలపై పోకిరీల దాడి రంగంలోకి దిగిన పోలీసులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ (Raipur) లోఘోర ఘటన జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఓ పుట్టినరోజు వేడుక అనంతరం ఇంటికి తిరిగిపోతున్న యువతులపై కొందరు యువకులు అమానుషంగా దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై తీవ్రంగా స్పందన వ్యక్తమవుతోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా భద్రత గురించి పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పుట్టినరోజు వేడుక… అనూహ్యమైన పరిణామం

బిలాస్‌పూర్ మరియు కోర్బా ప్రాంతాలకు చెందిన యువతులు తమ మిత్రుల పుట్టినరోజు వేడుక కోసం రాయ్‌పూర్‌లోని మహాదేవ్ ఘాట్ సమీపంలోని ఒక ప్రదేశానికి వచ్చారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొందరు యువకులు వారిని అడ్డగించి, వేధించడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఈ వేధింపులు తీవ్రరూపం దాల్చాయి. దుండగులు యువతులపై దాడికి దిగారు. దాడిలో ఓ దుండగుడు ఒక యువతి వేలును కొరికేశాడు.

వీడియో వైరల్… ప్రజల ఆగ్రహం

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువకులు అమ్మాయిలపై దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధిత అమ్మాయిలు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, దుండగులు వెనక్కి తగ్గలేదు. ఒక యువకుడు ఓ అమ్మాయిని వేధిస్తుండగా, ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటికే మరికొందరు యువకులు అక్కడకు చేరుకుని, మిగిలిన అమ్మాయిలపై కూడా దాడి ప్రారంభించారు.

వేధింపులు… అనంతరం దాడి

మరొక యువకుడు ఓ అమ్మాయిని బలవంతంగా లాగడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చి ఆమెను నేలపై మరింత దూరం ఈడ్చుకెళ్లినట్లు వీడియోలో రికార్డయింది. ఇంకో యువకుడు ఓ అమ్మాయి జుట్టు పట్టుకుని లాగుతుండగా, ఆమె విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.

పోలీసుల స్పందన

రాయ్‌పూర్‌ ఎస్‌పీ ఉమేద్ సింగ్ ఈ ఘటనపై స్పందించారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించినట్టు చెప్పారు. దాడికి పాల్పడిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని, యువకులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read also: Ayodhya: అయోధ్య రామ మందిరంలో మేలిమి బంగారంతో కొనసాగుతున్న నిర్మాణ పనులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870