📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Rain Alert: అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు..

Author Icon By Rajitha
Updated: November 23, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో (Tamil nadu) మళ్లీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రం వద్ద ఏర్పడ్డ అల్పపీడనం బలపడడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ 16 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.

Read also: G20 Summit 2025: సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన

Low pressure alert issued in Tamil Nadu due to heavy rainfall

భారీ నుంచి అతి భారీ వర్షాలు

దక్షిణ, మధ్య, ఉత్తర తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాథపురం, విరుదునగర్, మధురై, శివగంగ వంటి జిల్లాల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, కడలూరు వంటి డెల్టా జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోనూ వర్షపాతం పెరుగుతుందని అధికారులు చెప్పారు.

భారీ వర్షాల ప్రభావంతో తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరి భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తామిరబరణి నది పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సూచించారు.

మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోతట్టు ప్రాంత నివాసితులు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Heavy Rainfall latest news Low Pressure Tamil Nadu Rains Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.