📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Rain Alert: దేశంలో పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలు

Author Icon By Sharanya
Updated: August 5, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత మూడురోజులుగా ఉత్తరాది, దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు (Rain Alert) కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం (Heavy rain in Hyderabad) కురిసింది. రోడ్లపై నీళ్లు ప్రవహించడంతో పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు గంటలకొద్దీ రోడ్లపై ఉండిపోయారు. రోడ్లపై నీటిప్రవాహంతో ఎక్కడివాహనాలు అక్కడే ఆగిపోవడంతో మెట్రోకి ప్రయాణికుల తాకిడి పెరిగింది. స్టేషన్లనీ ప్రయాణికులతో కిటకటలాడాయి.

Rain Alert


కాగా ఈనెల 10వతేదీ వరకు రెండు తెలుగురాష్ట్రాలకు భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈరెండు రాష్ట్రాలలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గతవారంలో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్లో కురిన వర్షాలకు పలు వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడిపోవడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేసారు. సహాయచర్యలు చేపట్టిన తదనంతరం తిరిగి వాహనాలను పునరుద్ధరించారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కాగా మరో రెండు రోజులు భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షసూచన ఉంది. జాలర్లు వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్లో వర్షాలకు 252 మంది మృతి

కాగా మధ్యప్రదేశ్లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు సుమారు 252 మంది మరణించారు. 254 రోడ్లు దెబ్బతిన్నాయి. 3 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. భోపాల్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ ఉత్తరాది రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/intuc-wins-massive-victory-in-telangana-foods-employees-union-elections/telangana/526320/

Breaking News HeavyRainsIndia IMDAlert latest news RainAlert RainWarning Telugu News WeatherAlert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.