గుంతకల్లు Railway : ప్రస్తుతం వారానికి నాలుగు రోజుల పాటు రేణిగుంట హజరత్ నిజామొద్దీన్-రేణిగుంట మద్య తిరుగుతున్న నెంబర్ 00761/62 దూద్ దురంతో ప్రత్యేక రైలు సర్వీసులకు, ప్రజల సౌకర్యార్థం అదనంగా ప్రయాణికుల బోగీలను జతచేసి గుంతకల్లు-నిజామొద్దీన్-గుంతకల్లు మద్య మిక్స్డ్ రైలుగా నడిపేందుకు సంబంధించిన ప్రతిపాదనలను దక్షిణ మద్య రైల్వే, రైల్వే బోర్డుకు పంపింది. దేశ రాజధాని ఢిల్లీవాసుల సౌకర్యార్థం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రేణిగుంట- నిజామొద్దీన్ల మద్య 10 పాలట్యాంకర్లు, మూడు పార్సల్ వ్యాన్లు, గార్డు బోగీలతో కలిపి మొత్తం 14 బోగీల ఫార్మేషన్తో దూద్ దురంతో ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు (Express train) తిరుగుతుంది. ఈ రైలు సర్వీసుల ద్వారా చిత్తూరు మిల్క్ డైరీ ఉత్పత్తి చేసే పాలను హజరత్ నిజామొద్దీన్కు రవాణా చేస్తోంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, రైల్వే డివిజన్ పరిధిలోని గుంతకల్లు, ధర్మవరం, పాకాల, తిరుపతి, రేణిగుంట, విజయవాడ, బల్హార్హాల మీదుగా హజరత్ నిజామొద్దీన్ వరకు అదనంగా మరో 10ప్రయాణికుల బోగీలను జతచేసి మొత్తం 24బోగీలతో దూద్ దురంతో మిక్స్డ్ రైలుగా నడిపేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసామన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :