పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు రైల్వేశాఖ(Railway News) ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు భారీగా ప్రత్యేక రైలు సర్వీసులు నిర్వహించిన రైల్వేశాఖ, ఇప్పుడు మార్చిలో జరగనున్న హోలీ పండుగను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also:Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 160 స్పెషల్ ట్రెయిన్లు
హోలీ పండుగ నేపథ్యంలో(Railway News) సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశముందని అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే, ముందుగానే అప్రమత్తమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 160 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా సేవలు అందించనున్నాయి.
ప్రధాన నగరాల మధ్య మెరుగైన కనెక్టివిటీ
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని పెంచనున్నాయి. విశాఖపట్నం, పాట్నా, రాజ్‌కోట్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, రాక్సువల్, షాలీమార్, లక్నో, సంత్రగాచి, మాల్దా టౌన్, చాప్రా వంటి ముఖ్య నగరాలకు ఈ రైళ్లు ప్రయాణించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దూర ప్రాంతాలకు నేరుగా కనెక్టివిటీ ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేగవంతమైన, సురక్షిత ప్రయాణంతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
దేశవ్యాప్తంగా 1500 ప్రత్యేక రైళ్లు
హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మొత్తం 1500 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. గత ఏడాది హోలీ సందర్భంగా 1144 ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన రైల్వే, ఈసారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచింది. దేశం నలుమూలలకు కనెక్టివిటీ మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి పనులు
ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 1337 స్టేషన్లను ఆధునీకరించేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 172 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. అలాగే 2022–25 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 8,626 రైల్వే బ్రిడ్జిలకు మరమ్మత్తులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: