గుంతకల్లు రైల్వే Railway Board : భారతీయ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓగా పనిచేస్తున్న సతీస్ కుమార్ పదవికాలాన్ని మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ కేంద్ర నియామకాల క్యాబినేట్ కమిటీ కార్యదర్శి మనిషా సక్సేనా ఆదేశాల జారీ చేశారు. ఐఆర్ఎస్ఎంఇ క్యాడర్కు చెందిన సతీష్ కుమార్ 1986-88 బ్యాచ్ (Batch) అధికారి. 1988లో వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (DLB) లో ఎఎంఇగా తనసర్వీసు ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా తన ప్రతిభా సామ ర్థ్యాలను కనబరిచి 2022లో నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్ జోన్ జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన 2024 సెప్టెంబరు 1 నుంచి రైల్వే బోర్డు చైర్మన్/సిఇఓగా నియమించింది. సతీష్ కుమార్ ఆగస్టు 31నపదవి విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం సతీష్ కుమార్ను రైల్వే బోర్డు చైర్మన్గా 1–9-2025నుంచి మరో ఏడాది పాటు రైల్వే బోర్డు చైర్మన్, సిఇఓగా కొనసాగించాలని నిర్ణయించి ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
సతీష్ కుమార్ ఎవరు, ఆయన ప్రస్తుత పదవి ఏమిటి?
సతీష్ కుమార్ భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా పనిచేస్తున్నారు. ఆయన ఐఆర్ఎస్ఎంఇ క్యాడర్కు చెందిన 1986-88 బ్యాచ్ అధికారి.
సతీష్ కుమార్ పదవీకాలం ఎంతవరకు పొడిగించబడింది?
కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ ఆదేశాల ప్రకారం, సతీష్ కుమార్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఆయన 2025 సెప్టెంబర్ 1 నుంచి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా కొనసాగనున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :