📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Railway Accident: నోయిడాలో  రైల్వే ట్రాక్‌పై నిర్లక్ష్యం ప్రాణం తీసింది

Author Icon By Radha
Updated: October 13, 2025 • 7:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు నిమిషాల ఆతురత ప్రాణాంతకమైంది

మనలో చాలామంది రైల్వే(Railway Accident) ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. “ఇంకా కొంచెం సమయం ఉంది, వెళ్లిపోదాం” అన్న తొందరలోనే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అలాంటి ఘోర ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో(Greater Noida) చోటుచేసుకుంది.

Read also: Vinutha kota: రాయుడు హత్యకేసుపై వీడియో చేసిన వినుత 

ఆదివారం రోజు తుషార్ అనే యువకుడు బైక్‌పై దాద్రి రైల్వే(Railway Accident) ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. రైలు రావడానికి ఇంకా సమయం ఉందని భావించి, బైక్‌పైనే ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు. అయితే బైక్ జారిపడి రైల్వే పట్టాలపై పడిపోయింది. బైక్‌ను పైకి ఎత్తేలోపే రైలు వేగంగా వచ్చేసింది. పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించినా అప్పటికే రైలు ఢీకొట్టి తుషార్ అక్కడికక్కడే మృతిచెందాడు.

ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు

ఈ దారుణ ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గేట్ మూసి ఉన్నపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్ దాటవద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది.

బాధితుడు ఎవరు?
తుషార్ అనే యువకుడు బైక్‌పై ప్రయాణిస్తున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

greater noida news latest news Railway Warning Train Track Safety Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.