📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi : ఈసీపై నిప్పులు చెరిగిన రాహుల్

Author Icon By Divya Vani M
Updated: June 7, 2025 • 10:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈసీ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల కమిషన్ (Election Commission) తన విశ్వసనీయతను రుజువు చేసుకోవాలంటే కీలకమైన డేటాను బహిరంగం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. సాయంత్రం 5 తర్వాత పోలింగ్ బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలన్నారు. అలాగే ఓటర్ల పూర్తి డిజిటల్ జాబితాను ప్రచురించాలని కోరారు.రాహుల్ ఆరోపణల ప్రకారం బీజేపీ ఐదు దశల వ్యూహంతో రిగ్గింగ్‌కు పాల్పడిందని అన్నారు. ప్యానల్ నియామక దశ నుంచే అవకతవకలు మొదలయ్యాయని పేర్కొన్నారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారని తీవ్రంగా మండిపడ్డారు.

ఈసీ స్పందన — తీవ్రమైన ఖండన

రాహుల్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. ఆయా ఆరోపణలు అసంబద్ధమని, ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తేల్చేసింది. డిసెంబర్ 2024లోనే కాంగ్రెస్ పార్టీకి తగిన సమాచారం అందించామని తెలిపింది. అదే డేటాను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు తెలిపింది.సాక్ష్యాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేయడం అసహనంగా ఉందని ఈసీ పేర్కొంది. నిర్దిష్ట ఆధారాల్లేని విమర్శలు, ఎన్నికల సిబ్బందిపై నైతిక ఒత్తిడిని పెంచుతాయని మండిపడింది. స్వతంత్రత, నిష్పక్షపాతతతో పని చేస్తున్నామని స్పష్టం చేసింది.

తిరిగి స్పందించిన రాహుల్

ఈసీ స్పందన తర్వాత రాహుల్ మళ్లీ స్పందించారు. “మీది రాజ్యాంగబద్ధ వ్యవస్థ, అనామక స్పందనలు తగవు,” అన్నారు. ప్రజల విశ్వాసం పొందాలంటే, తక్షణం డేటాను బహిరంగం చేయాలని కోరారు.

Read Also : Benagaluru Stampede : చిన్నస్వామి స్టేడియం దుర్ఘటన – కేఎస్‌సీఏ పై CID దర్యాప్తు

ECI vs Rahul Gandhi Election Commission response match fixing allegations Rahul Gandhi Maharashtra elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.