News Telugu: Rahul Gandhi – ‘ఓట్ల దొంగతనం’పై ఆధారాలతో గుట్టురట్టు: రాహుల్ గాంధీ

Read Time:  1 min
Rahul Gandhi
Rahul Gandhi
FONT SIZE
GET APP

దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపులు, దొంగతనాలు జరుగుతున్నాయి అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి పెద్ద బాంబు పేల్చారు. ఎన్నికల సంఘం సాక్షాత్తూ ఈ కుట్రకు రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ వివరించిన ప్రకారం, కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఏకంగా 6,000కి పైగా ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నం జరిగింది. ఇది అనుకోకుండా బయటపడిన ఒక ఉదంతమని, ఇలాంటి ఎన్నో సంఘటనలు మిగిలి ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.

వ్యక్తి పేరిట నమోదు అయ్యిందని

ఓటర్ల జాబితాలో పేర్లు ఎలా తొలగిస్తున్నారో ఉదాహరణతో వివరించారు. ఒక బూత్ లెవెల్ అధికారి బంధువు పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో విచారణ జరిపారు. రికార్డుల్లో ఆ ఓటు (votes) తొలగించడానికి దరఖాస్తు పొరుగు వ్యక్తి పేరిట నమోదు అయ్యిందని తేలింది. అయితే ఆ వ్యక్తి తానే ఆ దరఖాస్తు చేయలేదని చెప్పడంతో అసలు వ్యవహారం బయటపడిందని రాహుల్ వివరించారు. ఈ ఘటనను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ, “ఓటు తొలగించిన వ్యక్తికీ తెలియదు, ఓటు పోగొట్టుకున్న వ్యక్తికీ తెలియదు. మధ్యలో ఉన్న గోప్యమైన శక్తులే ఈ ప్రక్రియను హైజాక్ చేస్తున్నాయి” అని మండిపడ్డారు.

Rahul Gandhi

Rahul Gandhi

రాహుల్ హెచ్చరించారు.

బీజేపీపై, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ (Commissioner Gyanesh Kumar) పై ఆయన నిప్పులు చెరిగారు. “సీఈసీ స్వయంగా ఈ కుట్రకారులకు రక్షణ కల్పిస్తున్నారని” రాహుల్ ఆరోపించారు. ఇదే ఆరంభం మాత్రమేనని, త్వరలోనే మరింత బలమైన ఆధారాలు – తాను ‘హైడ్రోజన్ బాంబ్’ (Hydrogen bomb) అని పిలుస్తున్న సాక్ష్యాలు బయటకు తీసుకువస్తానని రాహుల్ (Rahul Gandhi) హెచ్చరించారు. ఈరోజు చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు నిజం త్వరలో దేశ ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏంటి?
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వ్యవస్థీకృతంగా ఓట్ల దొంగతనం జరుగుతోందని, దీనికి ఎన్నికల సంఘం రక్షణగా నిలుస్తోందని ఆరోపించారు.

ఆయన ఎక్కడ ఉదాహరణ చూపించారు?
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లను అక్రమంగా తొలగించే ప్రయత్నం జరిగినట్లు ఉదాహరణ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/england-vs-ireland-first-t20-win-salt-89/sports/549613/

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.