📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Rahul Gandhi : మహాకూటమి పోస్టర్లలో రాహుల్‌ ఫొటో మాయం..

Author Icon By Sudha
Updated: October 23, 2025 • 2:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ పోస్టర్ల నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.వచ్చే నెల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఫొటోను మాత్రమే ప్రముఖంగా ప్రదర్శించారు. మిగతా భాగస్వామ్య పార్టీల నేతల చిన్న ఫొటోలను పోస్టర్లలో ఏర్పాటు చేశారు. అయితే, అందులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఫొటో (Rahul Gandhi) మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

Read Also: Formers: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ..అకౌంట్లోకి డబ్బులు జమ

Rahul Gandhi

దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విమర్శలకు ఎక్కుపెట్టింది. తేజస్వి యాదవ్‌, ఆయన మద్దతుదారులు.. రాహుల్‌ నాయకత్వాన్ని అవమానించారంటూ వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలపై బీజేపీ నేత షెహజాద్‌ పూనవాలా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘నిన్నటి వరకూ రాహుల్‌ గాంధీయే కూటమి ముఖచిత్రంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఈ కూటమికి గందరగోళం, విభజన, పదవుల కోసం ఆశ తప్ప.. ఒక లక్ష్యం గానీ, దార్శనికత గానీ లేవు’ అంటూ ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ బ్యాక్ గ్రౌండ్?

రాహుల్‌ గాంధీ జూన్ 19, 1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో జన్మించారు. తరువాత భారతదేశ 6వ ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా గాంధీ దంపతులకు జన్మించిన ఇద్దరు పిల్లలలో ఆయన మొదటివాడు.

రాహుల్‌ గాంధీ రాజకీయ జీవితం?

రాహుల్ గాంధీ 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి చంద్ర ప్రకాష్ మిశ్రాపై 390,179 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రాహుల్ గాంధీ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఆశిష్ శుక్లాపై 464,195 ఓట్లతో మెజారిటీతో గెలిచి రెండోసారి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 408,651 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1,07,903 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews congress election 2025 latest news Maha Kootami rahul gandhi Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.