📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rahul Gandhi: అమెరికాకు లొంగిపోయిన మోడీ

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Rahul Gandhi Modi surrendered to America

భారత్-అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్ ద్వారా భారతమాతను కేంద్ర ప్రభుత్వం అమ్మేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టి, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి సర్కారు హోల్‌సేల్‌గా సరెండర్ అయిపోయిందని ఆయన ఆరోపించారు. బుధవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. భారత్ – అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏకపక్షంగా ఉందని, దీనివల్ల భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఈ ట్రేడ్ డీల్ అమల్లోకి వస్తే, భారత మార్కెట్‌లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవాహం భారీగా పెరుగుతుందని రాహుల్ తెలిపారు.

Read Also: Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

భారత మాతను అమ్మేశారు.. రాహుల్

అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ధాటికి భారత రైతులు విలవిలలాడాల్సిన దుస్థితి వస్తుందన్నారు. ఇక భారతదేశ వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టేనని (Rahul Gandhi) ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ఫలితంగా ఇంధన భద్రతను భారత్ కోల్పోయిందన్నారు. ఇకపై భారత్ ఎవరి నుంచి చమురును కొనాలో అమెరికాయే చెబుతుందని రాహుల్ పేర్కొన్నారు. ట్రేడ్‌ డీల్‌పై చర్చల సందర్భంగా, భారత్‌ను సరిసమాన భాగస్వామిగా పరిగణించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ను కేంద్ర ప్రభుత్వం కోరి ఉండాల్సిందన్నారు. మీ ప్రభుత్వం భారతదేశాన్ని అమ్మేసింది. దేశాన్ని అమ్ముతున్నందుకు సిగ్గుగా లేదా ? మీరు భారత మాతను అమ్మేశారు అని రాహుల్ కామెంట్ చేశారు.

భారత ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వేలో ప్రపంచ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అమెరికా ఆధిపత్యాన్ని చైనా–రష్యాలు సవాల్ చేస్తున్నాయని పేర్కొన్న విషయాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఇంధన, ఆర్థిక వనరులను ఆయుధాలుగా ఉపయోగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. భారత్ ఎవరి నుంచి ముడి చమురు కొనాలనే విషయంలో అమెరికా జోక్యం ఉండకూడదని, మోదీ (Modi) ప్రభుత్వం దేశ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:


congress Farmers issues Fuel Security India-US trade deal Latest News in Telugu Lok Sabha rahul gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.