📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ

Author Icon By sumalatha chinthakayala
Updated: December 19, 2024 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్ సభలో అనుసరించ వలసిన వ్యూహంపై ప్రతిపక్షాలు సమాయత్తమయ్యాయి. అందులో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీలోని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన ఎంపీలతో రాహుల్ గాంధీ చర్చిస్తున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర్ ద్వార్ వరకు మార్చ్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

కాగా, రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్.. అని ఇన్ని సార్లు భగవంతుడి పేరు తలచుకొంటే ఏడేడు జన్మలు వారికి స్వర్గంలో స్థానం లభించేదన్నారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రిగా అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని మోడీ సమర్థించే ప్రయత్నం చేశారు.

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అవమానించిందో హోం మంత్రి అమిత్ షా వెల్లడించారంటూ ప్రధాని మోడీ.. తన ఎక్స్ వేదికగా వరుసగా వివరించారు. అందుకే హోం మంత్రి చెప్పిన వాస్తవాలు చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఉల్కిపడిందన్నారు. అందులోభాగంగానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు విషయాలు ప్రజలకు తెలుసునని ఈ సందర్భంగా మోడీ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు.

BR Ambedkar congress MPs rahul gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.