📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi: రాహుల్ నివాసంలో ఇండియా కూటమి కీలక భేటీ

Author Icon By Anusha
Updated: August 4, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త్వరలో బీహార్ కు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇండియా కూటమి అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏవిధంగా తారుమారైపోయాయోతెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే సత్యం జగమెరిగినదే. గత లోక్సభ ఎన్నికల్లో 70 నుంచి 80 స్థానాల్లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలు చేసిన సంగతి విధితమే. ఈనెల 7వ తేదీన రాత్రి విపక్ష ఇండియా కూటమి నేతలకు డిన్నర్ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సందర్బంగాపలు అంశాలపై చర్చించనున్నారు.

ఈ అంశాలపై చర్చలకు అవకాశం!

బీహార్ ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఆర్) ప్రక్రియ, మహారాష్ట్ర ఓటరు జాబితాలపై ఆరోపణలు, ఆపరేషన్ సిందూర్, భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం, భారత్ పై ట్రంప్ (Trump) విధించిన సుంకాలపై ఈసమావేశంలో చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపారు.

Rahul Gandhi

సమావేశ ఎజెండా ఏమిటనేది తెలియదు

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమిని గెలిపించేందుకే బీహార్లో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను చేపట్టారని ఆయన ఆరోపించారు. ఈఅంశాలను సమావేశంలో తాను ప్రస్తావిస్తానన్నారు. బీహార్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్లనే తిరిగి గెలిపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారని ఫరూఖ్ అబ్దుల్లావ్యాఖ్యనించారు. తనకు రాహుల్ నుంచి పిలుపు వచ్చిందని, ఆగస్టు 7న జరిగే సమావేశానికి హాజరవుతానని సీపీఐ నేత డీ రాజా పేర్కొన్నారు.

45లక్షల ఓటర్లను చేర్చారు

బీహార్లో ఓటర్ల తొలగింపు, మహారాష్ట్రలో లక్షలాది ఓటర్ల చేరికతో ముడిపడిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని,శివసేన నాయకురాలు ప్రియాంకా చతుర్వేది అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో 45లక్షల మంది ఓటర్లను ఎలా చేర్చారు? చివరి గంటలోఓటరు జాబితాల నుంచి 70 లక్షల మంది ఓటర్లను ఎలా తొలగించారు? అనే ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పాలని ఆమె కోరారు.భారత ప్రజల రక్తానాన్ని పణంగా పెట్టి, కేవలం డబ్బుల కోసం పాకిస్తాన్తో టీమిండియా క్రికెట్ మ్యాచ్లకు మోదీ అనుమతించడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

2024 లోక్‌సభ ఎన్నికల ప్రకారం రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాహుల్ గాంధీ కుటుంబ నేపథ్యం ఏమిటి?

ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు, సోనియా గాంధీ కుమారుడు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pok-pakistans-intelligence-exposed-with-terrorists-funeral-in-pok/international/525610/

Andhra Pradesh election rigging allegations Bihar upcoming elections Breaking News India alliance strategy latest news Lok Sabha polls Bihar Rahul Gandhi statements Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.