📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Rahul Gandhi: నేను న‌ర‌వ‌ణేను న‌మ్ముతున్నాను.. రాహుల్ గాంధీ

Author Icon By Sudha
Updated: February 10, 2026 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం న‌ర‌వ‌ణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ వివాదాస్ప‌ద‌మైంది. ఆ బుక్‌లో ఉన్న కొన్ని అంశాల‌ను ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్ర‌స్తావించారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. వారం రోజుల నుంచి లోక్‌స‌భ వ్య‌వ‌హారాలు సాగ‌డం లేదు. అయితే ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వ‌ణే చేసిన ఓ ట్వీట్‌ను చదివి వినిపించారు. తాను రాసిన పుస్త‌కం ఆన్‌లైన్‌లో దొరుకుతోంద‌ని, లింక్ ఓపెన్ చేస్తే విష‌యాలు తెలుస్తాయ‌ని త‌న ట్వీట్‌లో న‌ర‌వ‌ణే పేర్కొన్న‌ట్లు రాహుల్ వెల్ల‌డించారు. ఆ బుక్‌ను పెంగ్విన్ రాండ‌మ్ హౌజ్ ఇండియా ప్ర‌చురించిన‌ట్లు తెలిసింది. కానీ తాము ఆ బుక్‌ను ఇంకా రిలీజ్ చేయ‌లేద‌ని పెంగ్విన్ సంస్థ తాజాగా ప్ర‌క‌టించింది.

Read Also : TaxRules: భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో భారీ మార్పులు

Rahul Gandhi

ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)మాట్లాడుతూ.. న‌ర‌వ‌ణే అబ‌ద్దం చెబుతున్నారా లేక పెంగ్విన్ సంస్థ అబ‌ద్దం చెబుతుందా అని అడిగారు. ప్రింట్‌లో కానీ, డిజిట‌ల్ ఫార్మాట్‌లో కానీ తాము ఆ పుస్త‌కాన్ని రిలీజ్ చేయ‌లేద‌ని పెంగ్విన్ సంస్థ చెబుతోంది. కానీ రాహుల్ మాత్రం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న‌ట్లు పేర్కొన్నారు. అయితే పెంగ్విన్ క‌న్నా మాజీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌ల‌ను న‌మ్ముతున్న‌ట్లు రాహుల్ తెలిపారు. నేను న‌ర‌వ‌ణేను న‌మ్ముతున్నాను, ఆయ‌న అబ‌ద్దం చెప్ప‌ర‌ని భావిస్తున్నా, పెంగ్విన్ అబ‌ద్దం చెబుతుందా అన్న అంశంలో నిజాన్ని నిర్దారించ‌లేమ‌ని రాహుల్ అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : http://epapervaartha.com

Read Also :

Breaking News Congress leader Indian Politics latest news Political News rahul gandhi Rahul Gandhi statement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.