జమ్ము కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సమయంలో పూంఛ్ జిల్లా పలు గ్రామాలు తీవ్ర ఉద్రిక్తతలకు లోనయ్యాయి. పాక్ ప్రేరిత ఉగ్రదాడుల కారణంగా అనేక కుటుంబాలు బలయ్యాయి. ఈ ఘటనలతో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. బాధను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ చిన్నారులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అండగా నిలిచారు.
ప్రత్యక్ష పర్యటనలో చిన్నారుల కష్టాలు తెలుసుకున్న రాహుల్
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలకు ప్రత్యేక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పూంఛ్ (Poonch) ప్రాంతంలో స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అనాథలైన చిన్నారుల పరిస్థితిని తెలుసుకున్న రాహుల్, వెంటనే పార్టీ శ్రేణులకు ఆ జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ వీరుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 22 మంది చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారు. వారందరికీ విద్య, వైద్యం, జీవనోపాధి ఖర్చులు తదితర అవసరాలను రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా భరించనున్నట్టు వెల్లడించారు.
గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, వైద్యం
ఈ చిన్నారులకు డిగ్రీ చదువు పూర్తయ్యే వరకు అన్ని అవసరాలకూ ఆర్థిక సహాయం అందించనున్నట్లు సమాచారం. దీంతో పాటు వైద్య సహాయం, వస్త్రధారణ, జీవనోపాధికి అవసరమైన ఇతర విషయాల్లోనూ రాహుల్ వారి కుటుంబంలా అండగా భరిస్తారని హమీద్ వివరించారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Nimisha Priya: నిమిష ఉరిశిక్ష రద్దుపై కేంద్రం ఏమన్నదంటే..