Raghav Chadha: పెళ్లయిన దంపతులు వేర్వేరుగా పన్ను దాఖలు ఎందుకు?

Read Time:  1 min
పెళ్లయిన దంపతులు వేర్వేరుగా పన్ను దాఖలు ఎందుకు?
పెళ్లయిన దంపతులు వేర్వేరుగా పన్ను దాఖలు ఎందుకు?
FONT SIZE
GET APP

తన పదునైన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) మరోసారి పార్లమెంట్ లో తన గళాన్ని లేవనెత్తారు. సోమవారం సాధారణ భారతీయులు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను పార్లమెంట్ వేదికగా వెలుగులోకి తెచ్చారు. వాటి కోసం ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని కోరారు. ఆయన ప్రతిపాదించిన అంశాలలో మొదటగా.. దంపతులు ఐచ్ఛికంగా ఉమ్మడి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని సూచించారు. రాజ్యసభలో బడ్జెట్ సమావేశపు చర్చ సందర్భంగా రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో భార్యాభర్తలు వేరుగా పన్ను చెల్లించాలి అని ఉండటంతో.. ఎక్కువ సంపాదించే భాగస్వామి అధిక పన్ను చెల్లించాల్సి వస్తోంది.

Read Also: Sridevi Property Dispute: శ్రీదేవి ఆస్తి వివాదం: బోనీ కపూర్ కుటుంబానికి హైకోర్టులో ఊరట

Raghav Chadha: Why do married couples file taxes separately?
Raghav Chadha: Why do married couples file taxes separately?

ఆదాయాలు కలిగిన పెళ్లైన జంటలు నష్టపోకుండా ఉండేందుకు..

అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో దంపతులు ఆదాయాన్ని కలిపి పన్ను లెక్కింపులో ఉపయోగించుకుంటున్నారని.. భారతదేశంలో కూడా ఐచ్ఛిక ఉమ్మడి ఫైలింగ్ వల్ల కుటుంబాలపై పన్ను భారం తగ్గి, సమానమైన విధానాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. వివిధ రకాల ఆదాయాలు కలిగిన పెళ్లైన జంటలు నష్టపోకుండా ఉండేందుకు.. ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఇద్దరూ కలిసి ఉమ్మడిగా దాఖలు చేయడానికి అనుమతించాలనేదే మొదటి ఆందోళన అని చద్దా వివరించారు. రెండవ అంశం ఏంటంటే.. గాయపడిన సైనికులకు ఇచ్చే వైకల్య పింఛన్లపై పన్ను మినహాయింపును పునరుద్ధరించడం. ఇటీవల ఏర్పడిన విధాన ప్రకారం..అనారోగ్యంతో సేవ నుండి వైదొలిగిన సైనికులకే పూర్తి మినహాయింపు ఉంది. అయితే, గాయపడినప్పటికీ సేవ కొనసాగించిన సైనికులు లేదా పదవీ విరమణ చేసిన వారు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సైనికులకు అన్యాయం, నిరుత్సాహం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ఆయన ప్రభుత్వాన్ని గాయపడిన అందరు సైనికులకు 100 శాతం పన్ను మినహాయింపును కల్పించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.