📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu news: QR Code: హైవేలపై క్యూఆర్ కోడ్ బోర్డులు – సమాచారం ఒక క్లిక్‌లో

Author Icon By Pooja
Updated: October 3, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రయాణికుల సౌకర్యార్థం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇకపై హైవేల వెంట ప్రత్యేక సమాచార బోర్డులను ఏర్పాటు చేసి వాటిపై క్యూఆర్ కోడ్లను అందుబాటులో ఉంచనుంది. ప్రయాణికులు ఈ క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్[Scan] చేస్తే రహదారులకు సంబంధించిన పూర్తి వివరాలు, అత్యవసర సేవల సమాచారం వెంటనే తెలుసుకోవచ్చు.


Read also : Stock Market: భారత్ మార్కెట్ బలహీనత – సెన్సెక్స్ 229 పాయింట్లు డౌన్

క్యూఆర్ కోడ్ ద్వారా లభించే సమాచారం

ఈ కోడ్ స్కాన్ చేయడం ద్వారా రహదారి నంబర్, ప్రాజెక్ట్ పొడవు, నిర్మాణం, నిర్వహణ కాలం వంటి వివరాలు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా టోల్ మేనేజర్, హైవే పెట్రోలింగ్ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్ సంప్రదింపు నంబర్లు, అత్యవసర హెల్ప్‌లైన్ 1033 కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, టోల్ ప్లాజా దూరం, ట్రక్కుల పార్కింగ్ స్థలాలు, వాహన సర్వీస్ స్టేషన్లు, ఈ-చార్జింగ్ స్టేషన్ల వివరాలు కూడా ఈ కోడ్‌లో లభిస్తాయి.

ప్రయాణికులకు మరింత సౌకర్యం

ఈ బోర్డులను టోల్ ప్లాజాలు[Toll plazas], రెస్ట్ ఏరియాలు, రహదారి ప్రారంభం, ముగింపు వద్ద ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. దీని వల్ల రహదారి భద్రత మెరుగుపడటమే కాకుండా, ప్రయాణికుల అనుభవం మరింత సులభతరం అవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.

ఆస్తుల మానిటైజేషన్‌తో ఆదాయం పెరుగుదల

ఇక్రా నివేదిక ప్రకారం, ఎన్‌హెచ్‌ఏఐ ఆస్తుల మానిటైజేషన్ ద్వారా 2026 నాటికి రూ. 35,000 నుండి రూ. 40,000 కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 24,399 కోట్ల ఆదాయంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. బడ్జెట్ లక్ష్యమైన రూ. 30,000 కోట్లను అధిగమించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

హైవేలపై క్యూఆర్ కోడ్లు ఎక్కడ అందుబాటులో ఉంటాయి?
A: టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాలు, రహదారి ప్రారంభం మరియు ముగింపు పాయింట్ల వద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేయబడతాయి.

ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏ సమాచారం లభిస్తుంది?
A: రహదారి వివరాలు, అత్యవసర నంబర్లు, సమీప ఆసుపత్రులు, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, రెస్టారెంట్లు, ఈ-చార్జింగ్ స్టేషన్లు వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి.


Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu highways IndianHighways Latest News in Telugu NHAI QRCode RoadSafety SmartTravel Telugu News Today TravelIndia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.