ఈ సత్యసాయి శత జయంత్యుత్సవాలు పుట్టపర్తిలో (Puttaparthi) ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పుట్టపర్తి పర్యటనలో ఉన్నారు. సత్యసాయి శత జయంత్యుత్స వారు ఇక్కడ అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.
Read also : USA: బర్గర్ తినడంతో వ్యక్తి మృతి… అరుదైన ‘ఆల్ఫా గాల్ సిండ్రోమ్’ కేసు
ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడారంగాల దిగ్గజయాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థకంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. మోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సత్యసాయి బాబా సేవల్ని కొనియాడిన మోదీ, చంద్రబాబు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Prime Minister Modi) సత్యసాయి బాబా జీవితం, ఆయన బోధనలు, సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన బోధనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అవి అన్నితరాల వారికి ఆదర్శమని మోడీ సత్యసాయి బాబాను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సత్యసాయితో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమం తదనంతరం మోదీ తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళతారు. దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం 2025 ను ప్రారంభిస్తారు మోదీ. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 9కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,000 కోట్లకు పైగా విలువైన పీఎం-కిసాన్ 21వ విడతను విడుదల చేస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :