📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Puttaparthi: సత్యసాయి బాబా బయోగ్రఫీని తెలుసుకుందామా!

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Puttaparthi దేశాధినేతల్ని తనవద్దకు రప్పించుకున్న మహా గురువు ఈ సాయిబాబా సత్యసాయి బాబా అంటే తెలియని వారుండరు. భారతీయ ఆధ్యాత్మికవేత్తగా మాత్రమే కాదు తననుతానుగా ‘భగవంతుని అవతారం’ అని చెప్పుకునేవారు. 1926 నవంబరు 23న పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకు ఓ నిరుపేద వ్యవసాయం కుటుంబంలో జన్మించారు సత్యసాయిబాబా. ఇతని అసలు పేరు సత్యనారాయణ రాజు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించాడు.

Read Also: iBOMMA : పైరసీ ఆగితే సినిమాల వసూళ్లు పెరుగుతాయా?

ఇతన 14వ యేట చదువు, పుస్తకాలను వదిలేసి ‘నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది’ అని చెప్పాడు. తర్వాత మూడేళ్లపాటు ఓ తోటలో చెట్టుకింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలుపెట్టారు. వారిచేత భజనలు చేయించేవాడు. ఆ సమయంలలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటి నుంచి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు.

తాను శివుడు, శక్తి అవతారం అని ప్రచారం

1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తిల అవతారమని ప్రకటించాడు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. చిన్న మందిరంగా ఉన్న బాబా ఇల్లు నేడు పెద్ద భవంతులు, ప్రత్యేక మందిరాలు ఏర్పాటు అయ్యాయి. సత్యసాయిబాబా పలు సామాజిక సేవాకార్యక్రమాలను నడిపారు. రాయలసీమకు నీటి కొరతను తీర్చేందుకు తనవంతు నిధులను సమకూర్చి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎడారిసీమ అయిన అనంతపురం జిల్లాకు నీటి కొరతను తీర్చిన దాదాగా సత్యసాయిబాబాకు మంచి పేరుంది.

విశ్వవ్యాప్తంగా మందిరాలు

సత్యసాయిబాబా (Sathya Sai Baba) తన జన్మస్థలమైన పుట్టపర్తిలోనే నివాసం ఉండేవారు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే పెద్ద మద ప్రదర్శనశాల, మ్యూజియం, విమానాశ్రయం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. ఇక్కడికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు వస్తుంటారు. సత్యసాయిబాబా తన 80వ జన్మదినోత్స వానికి ప్రపంచం నలుమూలల నుంచి పదిలక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. బాబా మహిమల గురించి నమ్మకాలు, వివాదాలు ఉన్నాయి. బాబా విభూతిని, ఉంగరాలు, హారాలు, వాచీల వంటి వస్తువులనూ సృష్టించి భక్తులకు పంచిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. ఇతని భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నేడు సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, సచిన్  టెండూల్కర్,సుస్మితాసేన్ వంటి ప్రముఖు పుట్టపర్తికి వచ్చారు. వీరు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

biography Google News in Telugu Hindu guru Latest News in Telugu Puttaparthi ashram religious history. Sathya Sai Baba spiritual leader Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.