ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) తాజాగా రైతు పాత్రలో ప్రత్యక్షమవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అధికారిక సమావేశాలు, సమీక్షలు, పాలనాపరమైన తీర్మానాలతో నిత్యం బిజీగా ఉండే ఓ ముఖ్యమంత్రి, అలా నాగలి పట్టి పొలంలోకి దిగితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే చేశారు సీఎం ధామి. కాళ్ళకు మట్టికాపి, కుడిచేతితో నాగలి పట్టి, కాడెద్దుల మధ్య మట్టిలో నడిచారు. ఇది ఆయన శ్రమకు విలువనిచ్చే వ్యవసాయంపై ప్రేమను వెల్లడించడమే కాదు, రైతులకు మద్దతుగా నిలిచిన ప్రామాణిక ఉదాహరణ కూడా.
సంప్రదాయ పద్ధతులకే మొగ్గు
ఉత్తరాఖండ్‌లోని ధామి స్వగ్రామంలో జరిగింది. ముఖ్యమంత్రి ధామి (Pushkar Singh Dhami) తన సొంత పొలంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు. కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దుక్కి దున్నారు (plowing the field).
వరి నాట్లు – ప్రజలతో కలిసి
పొలం దుక్కిన తర్వాత, అక్కడున్న స్థానిక రైతులతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నాట్లు (Paddy fields) వేశారు. సీఎం సామాన్యుడిలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారీ వర్షాలు – వ్యవసాయానికి ఆశా కిరణం
ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులంతా వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో రైతులకు భరోసా కల్పిస్తూ వారిలో ఒకరిగా సీఎం ధామి పొలం పనుల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటం, వరదలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
Read also: Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు