డిల్లీ లోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో దర్శనం ఇచ్చిన రామ్మోహన్ నాయుడు ను చూసి ప్రధాని మోదీ తో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు.
Read Also: Guntur crime: వేరే వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య!
పండుగ వేడుకలు
దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా డిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నాడు పండుగ వేడుకలు జరిగాయి. తెలుగు, తమిళ సంప్రదాయాలను మిళితం చేస్తూ.. ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవ్వగా.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తన సహచర మంత్రులు, ఎంపీలతో కలసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ప్రధాని మోదీని రామ్మోహన్ నాయుడు సత్కరించారు.
అయితే ఎప్పుడూ కోట్ జాకెట్ డ్రెస్సింగ్ విధానాన్ని అవలంభించే రామ్మోహన్ నాయుడు.. అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, ధోవతి వేసుకుని ఈ యువ కేంద్ర మంత్రి దర్శనం ఇచ్చారు. వినూత్నంగా కనిపిస్తున్న రామ్మోహన్ నాయుడును మోదీతో సహా అక్కడున్న వారు చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: