స్వలింగ పెళ్లిళ్లకు చట్టబద్ధ గుర్తింపు లేనప్పటికీ సమాజంలో ఈ సంఖ్య పెరిగిపోతున్నది. సంతాన ఉత్పత్తికి ఏమాత్రం అవకాశం లేని ఇలాంటి స్వలింగ సంబంధాలపై యువతీయువకుల్లో అవగాహన పెంచాలి. (Punjab) తాజాగా పంజాబ్ లోని తర్న్ తరణ్ లో ఇలాంటి ఓ కేసు వెలుగు చూసింది. ఓ అమ్మాయి త్వరలో వధువుగా కానున్నది. అంటే మరో 14రోజుల్లో పెళ్లి. ఇందుకోసం రెండు కుటుంబసభ్యులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఇంతలోనే వధువు షాక్ ఇచ్చింది. కుటుంబసభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే వధువు మాత్రం తన స్నేహితురాలైన మరో అమ్మాయితో పారిపోయింది. స్థానిక మీడియా ప్రకారం.. మురాదీపురా ప్రాంతంలో నివసిస్తున్న ఒక కార్మిక కుటుంబానికి చెందిన కుమార్తె లఖ్వీందర్ కౌర్ వివాహం జనవరి 14న జరగాల్సి ఉంది. ఆమెకు ఖాదూర్ సాహిబ్ కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ కుటుంబం వివాహ సన్నాహాలు దాదాపు పూర్తి చేసింది. కన్యాదానం నుండి కట్నం వరకు ప్రతిదీ రుణాల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. పెళ్లి (Wedding) కార్డులు సైతం ముద్రితమయ్యాయి.
Read also: Delhi High Court: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి
ఇంటినుంచి పరార్ అయిన అమ్మాయిలు
ఇంతలో లఖ్వీందర్ కౌర్ స్నేహితురాలు సునీత తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా లఖ్వీందర్ కౌర్ తల్లిదండ్రులకు చెప్పింది. (Punjab) సునీత అబ్బాయిలా దుస్తులు ధరించి, తన పేరును రతగా మార్చుకుంది. తాము ఒకరినొకరం ప్రేమించుకున్నామని, స్వలింగ వివాహం చేసుకుంటామని పేర్కొంది. అయితే లఖ్వీందర్ కుటుంబసభ్యులు దీన్ని అంగీకరించలేదు. దీంతో డిసెంబరు 24వ తేదీని వీరిద్దరూ ఇంటినుండి పారిపోయారు. ఈ ఘటన పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు వీరిద్దరిని మహిళా పోలీసు అధికారులకు అప్పగించారు. ఈ బాలికలు మేజర్లు అయినప్పటికీ, చట్టపరమైన అభిప్రాయాలను కోరుతున్నామని డీఎస్పీ స్పష్టం చేశారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఆందోళన నెలకొంది. ఎంతో పద్ధతిగా పెంచిన తమ కుమార్తె ఇలా తమ పరువుతీస్తుందని ఊహించలేదని లఖ్వీందర్ కౌర్ తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: