Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో సంచలనం రేపుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి లాల్‌జీత్ సింగ్ భుల్లార్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గోదాముల సంస్థ (Punjab State Warehousing Corporation) అమృత్‌సర్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న గగన్‌దీప్ సింగ్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి మరణం చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Read Also :LPG Supply: గ్యాస్ కష్టాలకు చెక్: హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం
Punjab Politics: టెండర్ల వివాదం, వేధింపులే కారణమా?
అసలు వివాదం జిల్లా గోదాముల టెండర్ల కేటాయింపు విషయంలో మొదలైంది. మంత్రి భుల్లార్ తన తండ్రికి అనుకూలంగా టెండర్లు కేటాయించాలని గగన్‌దీప్‌పై ఒత్తిడి తెచ్చారని సమాచారం. అయితే, గగన్‌దీప్ రూ. 10 లక్షల ముడుపులు తీసుకుని వేరొకరికి ఆ టెండరును కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 13న గగన్‌దీప్‌ను తన నివాసానికి పిలిపించుకున్న మంత్రి, ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు అధికారి విడుదల చేసిన వీడియో వైరల్
గగన్‌దీప్ సింగ్ మరణానికి ముందు తన మిత్రుడికి పంపిన ఒక వీడియో ఇప్పుడు కీలక సాక్ష్యంగా మారింది. “మంత్రి భుల్లార్ నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు.. నేను ఇక బతకలేను, అందుకే విషపూరిత పదార్థం తాగాను” అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన అవినీతి ఆరోపణలు మరియు మంత్రి వేధింపుల కోణంలో విచారణ సాగుతోంది. ఒక నిజాయితీ గల అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రాణాలు కోల్పోవడంపై విపక్షాలు పంజాబ్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :