పంజాబ్ రాష్ట్రంలో(Punjab Crime) మరోసారి రాజకీయ హింస కలకలం రేపింది. తంగ్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత జర్మల్ సింగ్ (50)ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
Read Also: SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య
అమృత్‌సర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో(Punjab Crime) జరిగిన వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ దాడి జరిగింది. వేడుక జరుగుతున్న ప్రదేశంలోకి చొరబడిన దుండగులు జర్మల్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తలకు తుపాకీ గుండె తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో పాల్గొన్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. గతంలో జర్మల్ సింగ్‌పై మూడుసార్లు హత్యాయత్నాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ సరైన భద్రత లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలు, వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అన్న కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: