పంజాబ్‌లో మరోమారు మానవత్వాన్ని కించపరిచే ఘటన చోటుచేసుకుంది.పెళ్లికి,తిరస్కరించిందని ఒక మహిళ ఇంటికి నిప్పంటించి దారుణానికి పాల్పడిన ఓ సైకోగాడు, చుట్టుపక్కల వారిని షాక్‌కు గురి చేశాడు. ఈ ఘటనలో మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ సంఘటన జలంధర్ జిల్లా రామమండి ఫేజ్-2లోని ఏక్తా నగర్ ప్రాంతం (Ekta Nagar area) లో శనివారం (ఆగస్టు 3) ఉదయం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు సుఖ్వీందర్ కౌర్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ సమయంలో ఒక కూరగాయల వ్యాపారి వివాహం చేసుకోవాలని ఆమెపై బలవంతం చేస్తున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. కానీ సుఖ్వీందర్ (Sukhwinder) ఈ వివాహాన్ని నిరాకరించింది. దీంతో ఆ వ్యక్తి ప్రతీకార చర్యగా ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఘటన వివరాలు
నిందితుడు సుఖ్వీందర్ కౌర్ ఇంటికి తరచూ కూరగాయలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో అతడు ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదనను తీసుకువచ్చాడు. అప్పటికే ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన సదరు మహిళ అతనిని చెంపదెబ్బ కొట్టింది. ఈ చర్యతో ఆమెపై పగ పెంచుకున్న వ్యాపారి పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి, మహిళ ఇంటి గోడపైకి ఎక్కి ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న సుఖ్వీందర్ కౌర్, ఆమె ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు రామ మండి పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తెలిపారు.
పంజాబ్‌లో ప్రసిద్ధి చెందిన ఆహారం ఏమిటి?
పంజాబ్‌లో సర్సోం దా సాగ్, మక్కీ దా రోటీ, లస్సీ, బట్టర్ చికెన్, చోలే భటూరే వంటి వంటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి.
పంజాబ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఏవి?
పంజాబ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు: గోల్డెన్ టెంపుల్ (అమృత్‌సర్), జలియన్‌వాలా బాగ్, వాఘా బోర్డర్, ఆనంద్‌పూర్ సాహిబ్, రోపర్, పటియాలా కోటలు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: