ఆత్మరక్షణ కోసం మనమెన్నో జాగ్రత్తలను పాటిస్తుంటాం. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా మనకంటూ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఆ అతిజాగ్రత్తే మన ప్రాణాలమీదకు తెస్తుంది. ఓ వ్యక్తి ఆత్మరక్షణ కోసం పెట్టుకున్న గన్ అతడి ప్రాణాలనే తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. ధని సుచా సింగ్ గ్రామానికి చెందిన హర్పీందర్ సింగ్ అలియాస్ సోనూ కొన్నేళ్లపాటు విదేశాల్లో ఉండి ఈ మధ్యే స్వగ్రామానికి తిరిగొచ్చాడు.
Read also: Delhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్
ఆస్పత్రికి తరలించేలోపే మృతి
తన ఇంట్లో బంధువుతో మాట్లాడుతూ హర్పీందర్ సింగ్ అలియాస్ సోనూ సోఫాలోంచి లేచాడు. ఈ క్రమంలో అతడి నడుము భాగంలో ఉన్న తుపాకీ పొరపాటున పేలి ఓ తూటా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు హుటాహుటిగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వేరే మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వారు భఠిండా తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృత్యువాతపడ్డాడు. హర్వీందర్ కు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. మృతుడి తండ్రి నుంచి పోలీసులు వాంగ్మూలనం నమోదు చేశారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
నడుములో ఉన్న తుపాకి పేలింది
ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో సంబంధిత దృశ్యాలు రికార్డయ్యాయి. తుపాకులు ఆత్మరక్షణ కోసం దగ్గర పెట్టుకుంటే అవి పొరపాటున మనల్నే బలితీసుకుంటాయి. వీటిని సమీపంలో ఉంచుకున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తున్నది. ఎంతో ఆనందంతో అప్పటివరకు కుటుంబసభ్యులతో గడిపిన సోనూ విగతజీవిగా మారిపోవడం కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణించలేనిదిగా మారింది. ఎంతో ఉజ్వల భవిత ఉన్న అతనిని సొంత గన్నే ప్రాణాలను తీయడం విషాదం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: