📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: Punjab: పేద కుటుంబాన్ని వరించిన 3 కోట్ల లాటరీ

Author Icon By Tejaswini Y
Updated: November 26, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అదృష్టం ఎప్పుడు ఎవరి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పడం కష్టం. పంజాబ్‌(Punjab)లోని లుధియానా జిల్లా జాగ్రాన్ గ్రామానికి చెందిన మహేశ్వరి సాహ్ని అనే మహిళకు మూడు కోట్ల రూపాయల లాటరీ తగిలి ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మహేశ్వరిని పెళ్లి చేసిన కొద్దికాలంలోనే భర్త వదిలిపెట్టాడు. అప్పటి నుంచి ఆమె ఇతరుల ఇళ్లలో పనులు చేస్తూ తన పిల్లలను పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో కూతురితో కలసి ఉంటోంది. కొడుకును కోల్పోయిన తర్వాత మరింత కష్టాల్లో ఉన్న ఆమెకు లాటరీ(lottery) వరించడం ఒక పెద్ద ఆశీర్వాదంగా మారింది.

Read also : Delhi Blast: ఫరీదాబాద్‌లో వైట్‌ కాలర్ టెరర్ మాడ్యూల్, రహస్య మదరసా లింక్

3 crore lottery win for a poor family

జీవితంలో ఆ మరపురాని క్షణాలు
నవంబర్ 22 సాయంత్రం తమ కుటుంబం కొనుగోలు చేసిన నాలుగు లాటరీ టికెట్లలో ఒకటికి భారీ బహుమతి వచ్చిందని తెలుసుకున్న క్షణం కుటుంబం అంతా ఆనందంతో మునిగిపోయిందని మహేశ్వరి చెప్పింది. ఈ టికెట్లు(tickets) నవంబర్ 10న లుధియానాలోని గాంధీ బ్రదర్స్ లాటరీ సెంటర్‌లో కొన్నట్లు ఆమె తెలిపింది.

కూతురు కోసం తీసుకున్న నిర్ణయమే మాకు అదృష్టమైంది
జనవరి 17 తన కూతురి పుట్టినరోజు కావడంతో ఆమెకు బహుమతి కొనాలని భావించిన మహేశ్వరికి డబ్బులు లేకపోవడంతో, పేపర్లో ఒక అమ్మాయి లాటరీ గెలిచిన వార్తను చూసిన తర్వాత లాటరీ టికెట్ కొనాలని నిర్ణయించింది. తన చెవిపోగులను తాకట్టు పెట్టి సంపాదించిన రూ. 2000తో కూతురి పేరుమీద నాలుగు టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. అవే టికెట్లు చివరికి వారి జీవితాలను మార్చేశాయి.

అది దేవుని దయ
లాటరీలో వచ్చిన డబ్బుతో కూతురికి మంచి చదువు ఇప్పించి, ఆమె డాక్టర్ కావాలనే స్వప్నాన్ని నెరవేర్చాలని మహేశ్వరి చెబుతోంది. ఈ గెలుపును దేవుని ఆశీర్వాదం అని భావిస్తోంది. లాటరీ షాప్ యజమాని పేద కుటుంబం ఇలా ఎదగడం ఆనందంగా ఉందని, కానీ ఆన్‌లైన్‌లో లాటరీ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించాడు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Indian lottery story life-changing lottery Ludhiana woman wins lottery Maheshwari Sahni Punjab lottery win

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.