हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Pune Crime: యువతిపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించిందని చంపిన నిందితుడు

Sushmitha
Telugu News: Pune Crime: యువతిపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించిందని చంపిన నిందితుడు

పుణె (మహారాష్ట్ర): పుణెలోని(Pune) హవేలీ తాలూకాలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి(Rape) యత్నించి, ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవేలీ తాలుకాలోని ఉరులి కాంచన్‌కు చెందిన దినేశ్ సంజయ్ పటోలే (26) ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read Also: IND vs AUS: ఆఖరి వన్డేలో టాస్ ఓడిన టీమిండియా

Pune Crime

హత్య వివరాలు, దర్యాప్తు

పోలీసుల కథనం ప్రకారం, కోరెగావ్ ముల్ గ్రామానికి చెందిన బాధితురాలు ఈ నెల 14న రాత్రి 7:30 గంటల సమయంలో రోడ్డు పక్కన శవమై కనిపించింది. ఆమె తలపై గాయం ఉండటంతో ఇది హత్యగా నిర్ధారించారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ఉరులి కాంచన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు సుమారు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక విశ్లేషణ, సమాచార వర్గాల నుంచి అందిన వివరాలతో నిందితుడు పటోలే అని నిర్ధారించుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఐజీపీ వివరణ, నేరం జరిగిన తీరు

ఈ కేసుకు సంబంధించిన వివరాలను కొల్హాపూర్ రేంజ్ స్పెషల్ ఐజీపీ సునీల్ ఫులారీ మీడియాకు వెల్లడించారు. “కోరెగావ్ ముల్ గ్రామంలో బాధితురాలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించిన నిందితుడు ఆమెను అనుసరించాడు. లైంగిక వాంఛ తీర్చాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో, పక్కనే ఉన్న రాయితో తలపై మోది అక్కడికక్కడే చంపేశాడు” అని ఐజీపీ వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అక్టోబర్ 27 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పుణె రూరల్ ఎస్పీ తెలిపారు.

ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది?

మహారాష్ట్రలోని పుణె జిల్లా, హవేలీ తాలుకాలో ఈ ఘటన జరిగింది.

నిందితుడి పేరు ఏమిటి?

దినేశ్ సంజయ్ పటోలే (26).

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870