📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన చర్య

Author Icon By Anusha
Updated: March 1, 2026 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Priyanka Gandhi: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు.అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించడం, అనంతరం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు.

Read Also: CJI visit AP: కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

మహాత్మా గాంధీ సూక్తులతో శాంతి మంత్రం

“కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది” అన్న మహాత్మా గాంధీ మాటలను ప్రియాంక ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునే వారు, ఒక సార్వభౌమ దేశాధినేతను ఇలా లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం, వేలాది మంది అమాయకుల ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు.. దీనికి వారు ఏ కారణం చెప్పినా సమర్థనీయం కాదన్నారు.

అనేక దేశాలు ఇప్పుడు ఈ ఘర్షణలోకి లాగబడటం విషాదకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు సాగిలపడిన మన ప్రధాని మోదీ, కనీసం ఇప్పుడైనా యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran israel war Khamenei Death Priyanka Gandhi Reaction Targeted Assassination of Ali Khamenei

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.