📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Priyanka Gandhi: స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌డం వ‌ల్లే ఉగ్ర‌దాడి జ‌రిగింది.. ప్రియాంకా

Author Icon By Sudha
Updated: July 29, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెహల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయ‌లేద‌ని ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ప్ర‌శ్నించారు. బైసార‌న్‌లో స‌రైన భ‌ద్ర‌త‌ను ఎందుకు క‌ల్పించ‌లేద‌న్నారు. బాధితుల బాధ‌ను అర్థం చేసుకోగ‌ల‌న‌న్నారు. స‌రైన భ‌ద్ర‌త (Proper security)లేక‌పోవ‌డం వ‌ల్లే అక్క‌డ ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ట్లు ఆమె ఆరోపించారు. దాని వ‌ల్లే 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు.పెహ‌ల్గామ్‌లో చ‌నిపోయిన భార‌తీయల పేర్ల‌ను ఆమె చ‌ద‌వి వినిపించారు. ప్ర‌భుత్వంపై బాధ్య‌త‌తో టూరిస్టులు బైసార‌న్ లోయ‌కు వెళ్లార‌ని, కానీ ప్ర‌భుత్వం మాత్రం దేవుడి మీద భ‌రోసా వేసింద‌న్నారు. 2019లో టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ఏర్ప‌డింద‌ని, ఆర్మీ అధికారుల్ని చంపుతూ 25 సార్లు ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డింద‌ని, కానీ 2023లో ఆ సంస్థ‌ను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించార‌న్నారు. బైసార‌న్‌లో జ‌రిగిన భ‌ద్ర‌తా లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవ‌రైనా త‌మ ప‌దువుల‌కు రాజీనామా చేశారా అని ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi)అడిగారు.

Priyanka Gandhi: స‌రైన భ‌ద్ర‌త లేక‌పోవ‌డం వ‌ల్లే ఉగ్ర‌దాడి జ‌రిగింది.. ప్రియాంకా

నెహ్రూ గురించి బీజేపీ నేత‌లు ప్ర‌స్తావించ‌డంతో.. ఆమె మాట్లాడుతూ మీరు గ‌తం గురించి చెబుతున్నార‌ని, కానీ తాను మాత్రం ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి మాట్లాడుతున్న‌ట్లు పేర్కొన్నారు. 11 ఏళ్లు అధికారంలో ఉన్నార‌ని, దానికి బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. ముంబైలో 2008లో జ‌రిగిన సెప్టెంబ‌ర్ 26 దాడుల త‌ర్వాత ఆ రాష్ట్ర సీఎం, హోంశాఖ మంత్రి రాజీనామా చేసిన‌ట్లు ఆమె గుర్తు చేశారు. పెహల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. పాకిస్థాన్ సరెండ‌ర్ అయ్యేందుకు అంగీక‌రిస్తే, మ‌రి యుద్ధాన్ని ఎందుకు ఆపేశార‌ని ప్రియాంకా (Priyanka Gandhi)అడిగారు. అమెరికా అధ్య‌క్షుడు ఎందుకు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఉగ్ర‌వాద బాధితల బాధ‌ను అర్థం చేసుకుంటాన‌ని, త‌న‌కు వారి బాధ ఏంటో తెలుసు అని, త‌న తండ్రిని ఉగ్ర‌వాదులు చంపిన‌ప్పుడు త‌న త‌ల్లి ఎలా బాధ‌ప‌డిందో తెలుసు అని ప్రియాంకా అన్నారు. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం కేవ‌లం క్రెడిట్ ఆశిస్తున్న‌ద‌ని, కానీ బాధ్య‌త‌ను విస్మ‌రిస్తున్న‌ట్లు చెప్పారు. ఇదేమీ స్వ‌ర్ణ కిరీటం కాదు అని, ముళ్ల కిరీటం అని ఆమె పేర్కొన్నారు.

ప్రియాంక గాంధీ ఎవరు?

ప్రియాంక గాంధీ వాద్రా (నీ గాంధీ; జననం 12 జనవరి 1972) ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, ఆమె నవంబర్ 2024 నుండి కేరళలోని వయనాడ్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలిగా, ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు.

ప్రియాంక గాంధీ భర్త ఎవరు?

రాబర్ట్ వాద్రా (జననం 18 ఏప్రిల్ 1969) ఒక భారతీయ వ్యవస్థాపకుడు మరియు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది

Breaking News Home Ministry lack of security latest news Pahalgam Attack Priyanka Gandhi TeluguNews Terror attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.