కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు(Private Banks) ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్మిక సంఘాలతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని ప్రముఖ బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి.
Read Also: Budget 2026: అద్దె కట్టే వారికి వరంలా ఈ బడ్జెట్ ఉండేనా?
AIBEA, AIBOA, BEFI వంటి అగ్రశ్రేణి సంఘాలు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తూ, ఆ రోజు బ్యాంకు సిబ్బంది విధులకు హాజరుకాకూడదని స్పష్టంగా పేర్కొన్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో లావాదేవీలు, కౌంటర్ సేవలు, చెక్కుల క్లియరెన్స్ వంటి కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నాయని, కార్మికుల హక్కులను పరిమితం చేస్తున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలన్న డిమాండ్ కూడా ఇంకా నెరవేరకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 12న(Private Banks) జరగనున్న సమ్మె బ్యాంకింగ్ రంగంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు ముందుగానే అవసరమైన బ్యాంకు పనులను పూర్తి చేసుకోవాలని సూచనలు వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: