हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఢిల్లీలో భూకంపంపై స్పందించిన ప్రధాని

sumalatha chinthakayala
ఢిల్లీలో భూకంపంపై స్పందించిన ప్రధాని

మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలి..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.ఢిల్లీలో భూకంపంపై స్పందించిన ప్రధాని

భయాందోళనలకు గురైన జనం

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రంకపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా తెలిపింది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మంచం నుండి కిటికీ వరకు ప్రతిదీ కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఢిల్లీలో భూకంపంపై స్పందించిన ప్రధాని

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 కు డయల్

మరోవైపు ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఢిల్లీలోని ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 కు డయల్ చేసి మాకు సమాచారం ఇవ్వండి.. వెంటనే మేము మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఘజియాబాద్ నివాసి ఒకరు ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. భూప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ప్రకంపనలు చూడలేదు. భవనం మొత్తం ఊగిపోయింది. అని పేర్కొన్నాడు.

భూకంపం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

భూకంపం సంభవించినప్పుడు, శాంతిగా ఉండటం అత్యంత ముఖ్యమైనది. ప్రజలు అల్లకల్లోలం అవ్వకుండా, అధికారులు సూచించిన భద్రతా చర్యలు పాటించాలి. భూమి కంపించే సమయంలో బలమైన ఫర్నిచర్ లేదా టేబుల్ కింద దాచుకోవడం, కిటికీల నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. భూకంపం ఆగిపోయేవరకు భవనాల్లో ఉండడం మంచి ప్రవర్తన, బయటికి వెళ్లడం ప్రమాదకరం.

అత్యవసర కాలాల్లో సహాయం కోసం 112 కి కాల్ చేయండి

ప్రమాద సమయంలో, అనుకోని పరిస్థితులు ఎదురైతే ప్రజలు వెంటనే 112 నంబర్‌ను డయల్ చేసి సమాచారం ఇవ్వాలి. అత్యవసర సేవలు త్వరగా స్పందించి సహాయం అందిస్తాయి. ఈ నంబర్లను ముందుగా తెలుసుకుని ఉంచడం, భద్రత కోసం ముఖ్యమైన జాగ్రత్త.

స్థానిక అధికారులు విపత్తు నిర్వహణలో పాత్ర


భూకంపాలు వంటి సహజ విపత్తుల సమయంలో స్థానిక అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. వారు ప్రజలను అప్రమత్తం చేసి, తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు. ప్రజలకు సురక్షితమైన మార్గదర్శకాలు అందించడం, సహాయ చర్యలను తీసుకోవడం ఈ సమయంలో అత్యంత ముఖ్యమైనది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870