📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest Telugu News : Prime Minister: సామాజిక‌, ఆర్థిక ప్ర‌గ‌తికి విధుల నిర్వ‌హ‌ణ కీలకం : ప్ర‌ధాని మోదీ

Author Icon By Sudha
Updated: November 26, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ పౌరులు త‌మ రాజ్యాంగ విధుల‌ను నిర్వ‌ర్తించాల‌ని ప్ర‌ధాని మోదీ (Prime Minister) కోరారు. బ‌ల‌మైన ప్ర‌జాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయ‌న అన్నారు. రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న దేశ పౌరుల‌కు లేఖ రాశారు. ఓటు హ‌క్కును వినియోగించ‌డం వ‌ల్ల ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేసే బాధ్య‌తను నిర్వ‌ర్తించాల‌న్నారు. 18 ఏళ్లు నిండి తొలిసారి ఓట‌రుగా మారిన వ్య‌క్తుల‌ను రాజ్యాంగ దినోత్స‌వం రోజున గౌర‌వించాల‌న్నారు. క‌ర్త‌వ్యాల‌ను నిర్వ‌ర్తించ‌డం వ‌ల్లే హ‌క్కులు వ‌స్తాయ‌ని మ‌హాత్మా గాంధీ విశ్వాసాన్ని ప్ర‌ధాని మోదీ గుర్తు చేశారు.

Read Also : http://Draupadi Murmu: తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు

Prime Minister

సామాజిక‌, ఆర్థిక ప్ర‌గ‌తికి విధుల నిర్వ‌హ‌ణ కీల‌క‌మ‌న్నారు. నేటి త‌రం తీసుకునే విధానాలు, నిర్ణ‌యాలు రాబోయే త‌రం జీవితాల‌ను మార్చేస్తుంద‌న్నారు. వికసిత్ భార‌త్ ల‌క్ష్యం దిశ‌గా వెళ్తున్న దేశాన్ని మ‌దిలో పెట్టుకుని పౌరులు త‌మ క‌ర్త‌వ్యాల‌ను అమ‌లు చేయాల‌న్నారు. మాన‌వ హుందాత‌నానికి, స‌మాన‌త్వానికి, విముక్తికి మ‌న రాజ్యాంగం ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని, మ‌న‌కు హ‌క్కుల‌ను క‌ల్పిస్తుంద‌ని, దీంతో పాటు పౌరుల‌మ‌న్న బాధ్య‌త‌ల‌ను కూడా క‌ల్పిస్తుంద‌ని, దీన్ని మ‌నం ఎప్పుడూ నిర్వ‌ర్తించాల‌ని, ఆ విధులే మ‌న బ‌ల‌మైన ప్ర‌జాస్వామ్యానికి పునాది రాళ్లు అవుతాయ‌ని మోదీ (Prime Minister)త‌న ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత‌ల‌కు కూడా ఆయ‌న ఈ సంద‌ర్భంగా నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత‌ల విజ‌న్, ముందుచూపు ప్రేర‌ణ‌తోనే విక‌సిత్ భార‌త్ సాధించాల‌న్నారు.

భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు?

భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మరియు 1964 వరకు ఈ పదవిలో కొనసాగారు.

భారత ప్రధానమంత్రి హోదా?

భారతదేశంలో ప్రధానమంత్రి హోదాను కార్యనిర్వాహకులు మరియు అధికారుల ప్రోటోకాల్ జాబితాలో నమోదు చేస్తారు, దీనిని ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ అని పిలుస్తారు. ఈ ఆర్డర్‌ను భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు మరియు హోం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. జాబితా ప్రకారం, ప్రధానమంత్రి భారతదేశంలో 3వ స్థానంలో ఉంటారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews Economic Development India News latest news PM Modi prime minister Social Development Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.