📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Schools Reopen: విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం!

Author Icon By Shobha Rani
Updated: May 13, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌-పాక్‌ (India-Pak) మధ్య కొనసాగిన వార్‌ ప్రస్తుతం విరమించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాక్‌పై తన ప్రతాపం చూపించింది భారత్‌. ఈ యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం భారత్‌ -పాక్‌ (India-Pak)మధ్య ఉద్రిత్తకతలు చల్లారాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. భారత్‌- పాకిస్తాన్‌ (India-Pak)మధ్య ఉద్రిక్తతలతో ఈ నెల 7వ తేదీ నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరిస్థితులు సద్దుమణగడంతో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనడంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాలైన కథువా, జమ్మూ, రాజౌరి, పూంచ్, సాంబా, ఉధంపూర్‌లలో మంగళవారం కూడా విద్యాసంస్థలు మూసి ఉండనునున్నాయి. మంగళవారం సాయంత్రం పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ జిల్లాల్లో విద్యా సంస్థలను ప్రారంభించే నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు.

Schools Reopen: విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం!

సరిహద్దుయేతర ప్రాంతాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి
రాష్ట్రంలోని సరిహద్దుయేతర జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మంగళవారం తెరుచుకుంటాయి. పరిస్థితిని సమీక్షించిన తర్వాత జమ్మూ డివిజన్‌లోని దోడా, కిష్త్వార్, రియాసి, రాంబన్ జిల్లాల్లో మంగళవారం నుండి ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు తెరవాలని నిర్ణయించినట్లు డివిజనల్ కమిషనర్ తెలిపారు.
మోడీ ప్రసంగం అనంతరం పాక్ దూకుడు
ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన తర్వాత, పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించి జమ్మూలోని సాంబా, పర్గల్, గర్ఖల్ సెక్టార్లలో డ్రోన్ దాడికి ప్రయత్నించింది. భారత సైన్యం త్వరితగతిన చర్య తీసుకుని శత్రువు దాడిని తిప్పికొట్టింది. ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, మూడు ఇళ్లు దెబ్బతిన్నాయని, ఒక వృద్ధ మహిళ గుండెపోటుకు గురైనట్లు సమాచారం. శ్రీ మాతా వైష్ణో దేవి మార్గంలో, సరిహద్దు ప్రాంతాలలో ముందుజాగ్రత్త చర్యగా బ్లాక్అవుట్ కూడా విధించారు. యుద్ధ ఉద్రిక్తతల నడుమ విద్యార్ధుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. భద్రతతో కాకుండా విద్యాసంస్థలను ప్రారంభించడం నవశక్తిని ప్రోత్సహించే నిర్ణయం. పరిస్థితులు పూర్తిగా చల్లబడిన తర్వాత మిగతా జిల్లాల్లోనూ విద్యాసంస్థలు తెరుచుకుంటాయని అంచనా.

Read Also: America: ఫార్మా కంపెనీలకు 30 రోజులే గడువు.. ట్రంప్

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Prepare for the reopening of educational institutions! Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.