జన్ సురాజ్ నాయకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాబోయే ఐదేండ్లలో తాను పొందే ఆదాయంలో 90 శాతాన్ని పార్టీకే కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ(Delhi)లో కుటుంబం కోసం ఒక ఇల్లు మినహా, గత 20 ఏళ్లుగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా పార్టీకి అంకితం చేస్తానని స్పష్టం చేశారు.
Read Also: AP Road: ‘రోడ్ డాక్టర్’ తో .. ఇక స్మూత్‌గా రహదారులు!
‘బిహార్ నవ్నిర్మాణ్ సంకల్ప యాత్ర
ప్రజలు కూడా పార్టీకి సంవత్సరానికి రూ.1000 చొప్పున విరాళం అందించాలని ఆయన కోరారు. జనవరి 15 నుండి ‘బిహార్ నవ్నిర్మాణ్ సంకల్ప యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటిస్తూ, ఎన్నికల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: