📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Prashant Kishor : పార్టీ ఓటమికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను : ప్ర‌శాంత్ కిషోర్‌

Author Icon By Sudha
Updated: November 18, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల లో ఓటమి చవిచూసిన పార్టీలు ఇప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ‘జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోర వైఫల్యాన్ని చవిచూడటంపై ఆయ‌న తొలిసారి స్పందించారు. మంగ‌ళ‌వారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిజాయితీగా తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు.తప్పులను సరిచేసుకుని మరింత బలంగా ముందుకు వస్తామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor)వ్యాఖ్యానించారు. త‌మ‌వైపు నుంచి చాలా పాజిటివ్‌గా పనిచేశామ‌ని, కానీ ఎక్కడో పొరపాటు జరిగిందని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడంలో తాము విఫలమయ్యామ‌ని, ప్రజలను అర్ధం చేసుకోవడంలో కూడా విఫలమైనందుకు తానే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఆత్మపరిశీలన చేసుకుంటాన‌ని, తాను ఒకరోజు మౌనవ్రతం పాటిస్తున్నానని అన్నారు. తాము పొరపాట్లు చేసి ఉండవచ్చున‌నీ, కానీ ఎలాంటి నేరం చేయలేదని, ఓట్లు సాధించలేకపోవడం నేరం కాదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. తాము కుల రాజకీయాలకు పాల్పడలేదని, హిందూ-ముస్లింల‌కు చిచ్చుపెట్టే మాట‌లు చెప్పలేదని, విష ప్రచారం సాగించలేదని, పేదలు, అమాయక ప్రజల ఓట్లు కొనుగోలు చేయడమనే నేరానికి పాల్పడలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. అవ‌న్నీ చేసినవాళ్లు అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.

Read Also : http://Bihar Results: ఓ వ్యక్తి ప్రాణం తీసిన బిహార్ ఫలితాలు

Prashant Kishor

అభిమన్యుడిని యుద్ధంలో చంపినా మహాభారతంలో వారికి విజయం దక్కలేదని, న్యాయం వైపు ఉన్నవారే గెలిచారని, విజయం మావైపే ఉందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40 వేల‌ కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే విజయం సాధించిందని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం 60,000 నుంచి 62,000 మందికి రూ.10 వేల చొప్పున‌ ఇచ్చారని, అంతేగాక‌ రూ.2 లక్షల చొప్పున‌ రుణాలు ఇస్తామని వాగ్దానం చేశార‌ని ప్ర‌శాంత్ కిషోర్ గుర్తుచేశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తేనే లోన్లు వస్తాయని విధి నిర్వహణలో ఉన్న అధికారులు ప్రచారం చేశారని ఆరోపించారు. జీవికా దీదీలకు ప్రచార బాధ్యతలు అప్పగించారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News Election Strategy Indian Politics latest news Party Defeat Politics Prashant Kishor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.