Prashant Kishor: ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

Read Time:  1 min
Prashant Kishor
Prashant Kishor
FONT SIZE
GET APP

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌(Prashant Kishor)కు చెందిన జ‌న్ సూరజ్ పార్టీ దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor)దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం త‌న సంక్షేమ ప‌థ‌కంతో ఓట‌ర్లకు డ‌బ్బులు పంచింద‌ని జ‌న్‌సూర‌జ్ పార్టీ ఆరోపించింది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను కొట్టిపారేసింది. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని తిర‌స్క‌రించార‌ని, ఇప్పుడు మీరు ప‌బ్లిసిటీ కోసం న్యాయ ప్ర‌క్రియ‌ను వాడుకుంటార‌ని చీఫ్ జ‌స్టిస్ అన్నారు. మీకెన్ని ఓట్లు వ‌చ్చాయి, ఒక‌సారి ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తే, రిలీఫ్ కోసం జుడిషియ‌ల్ ఫోరంను వాడుతున్నార‌ని, ఆ స్కీమ్‌ను ఎవ‌రో ఒక‌రు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సింద‌ని కోర్టు పేర్కొన్న‌ది.

Read Also : Telangana: స్పీకర్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం

Prashant Kishor
Prashant Kishor

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సూర‌జ్ పార్టీ మొత్తం 238 సీట్ల‌లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. అయితే ఆ పిల్‌ను బీహార్ హైకోర్టుకు పంపింది సుప్రీం. కుటంబంలోని మ‌హిళ‌కు ప‌దివేలు ఇవ్వ‌డాన్ని పార్టీ త‌ప్పుప‌ట్టింది. ఆర్టిక‌ల్ 32 కింద త‌న పిటీష‌న్ ఫైల్ చేసింది. సుమారు 36 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు రిలీజ్ చేసి అధికార పార్టీ అక్ర‌మ విధానాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌న్‌సూర‌జ్ త‌న పిటీష‌న్‌లో తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.