జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).. తెలంగాణ సీఎం(Telangana CM) రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ను ఓడిస్తామని, రాహుల్ గాంధీ కాదు, ఆయన్ను ఎవరూ రక్షించలేరని ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)అన్నారు. బీహారీలను తక్కువ చేసి మాట్లాడిన రేవంత్‌కు గుణపాఠం చెబుతామన్నారు. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది చివరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. (Prashant Kishor) బీహారీలను ఉద్దేశిస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహారీలను కించపరుస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కిశోర్ తప్పుపట్టారు. భగవంతుడు టైం ఇచ్చాడని, వాళ్ల లెక్క సరి చేస్తామన్నారు. బీహారీ ప్రజలను తిట్టే వ్యక్తికి సలహాలు ఇవ్వబోమని, వాళ్ల లెక్కను తర్వాత సెటిల్ చేస్తామన్నారు.
తమ పార్టీని గెలిపించాలని కోరుతూ రేవంత్ రెడ్డి మూడుసార్లు తనను కలిసినట్లు ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. కానీ తామేమీ సాయం చేయలేదన్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి .. బీహార్ ప్రజలను హేళన చేసే విధంగా మాట్లాడినట్లు తెలిపారు. బీహార్ ప్రజల డీఎన్ఏ.. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా తక్కువ అని రేవంత్ పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. బీహారీల డీఎన్ఏ ఖరాబైందన్న రేవంత్‌కు వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని, ఎవరి దిమాక్ ఖరాబైందో అప్పుడు చూపిస్తామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మేం ఎవరికీ భయపడం అని, రాహుల్ గాంధీ కాదు కదా, ఎవరికీ భయపడమన్నారు. బీహారీ ప్రజలను తిట్టే వ్యక్తులకు బుద్ది చెబుతామన్నారు. శక్తినంతా వాడి రేవంత్‌ను ఓడిస్తానన్నారు. రాహుల్ గాంధీ కూడా రేవంత్‌ను కాపాడలేరన్నారు. బీహార్ ప్రజలను నిందించి, రాజనీతి చేస్తావా అని ప్రశ్నించారు. మేం ఎవరినైనా తిట్టామా అని ప్రశాంత్ అడిగారు. తెలంగాణకు వచ్చి మిమ్మల్ని ఓడిస్తామన్నారు. తెలంగాణ ప్రజల కన్నా బీహారీల డీఎన్ఏ తక్కువ అయితే, మరి మీరెందుకు వచ్చి సలహాలు తీసుకున్నారని రేవంత్‌ను ఆయన ప్రశ్నించారు.
ప్రశాంత్ కిషోర్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ను వ్యావహారికంగా PK అని పిలుస్తారు , ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ రాజకీయ వ్యూహకర్త . ఆయన ఐక్యరాజ్యసమితి నిధులతో కూడిన కార్యక్రమంలో ఎనిమిది సంవత్సరాలు ప్రజారోగ్యంలో పనిచేశారు , తరువాత భారత రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు.
ప్రశాంత్ కిషోర్ రాజకీయ జీవితం ?
కిషోర్ బిజెపి , జెడి(యు) , ఐఎన్‌సి , ఆప్ , వైఎస్‌ఆర్‌సిపి , డిఎంకె మరియు టిఎంసి వంటి అనేక రాజకీయ పార్టీలకు విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు . 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ముఖ్యమంత్రి పదవికి తిరిగి ఎన్నికయ్యేలా సహాయం చేయడం ఆయన మొదటి ప్రధాన రాజకీయ ప్రచారం. అయితే, ఆయన భావించిన ఎన్నికల ప్రచార సంస్థ అయిన సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పూర్తి మెజారిటీని సాధించడంలో సహాయపడినప్పుడు ఆయన విస్తృత ప్రజా దృష్టిని ఆకర్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: