బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్థాపించిన జన్ సూరజ్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో, రాజకీయ వ్యూహకర్తగా నుంచి నేతగా మారిన(Bihar Results) ప్రశాంత్ కిశోర్ (పీకే) ఒక రోజు మౌన వ్రతం చేపట్టారు. ఈ ఓటమి తర్వాత ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని చారిత్రక భితిహర్వా ఆశ్రమంలో గురువారం నాడు ఆయన ఈ దీక్షను ప్రారంభించారు.
సుమారు వందేళ్ల క్రితం మహాత్మా గాంధీ స్థాపించిన ఈ ఆశ్రమాన్ని పీకే ఎంతో గౌరవిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతితో పాటు ఇతర సహచరులతో కలిసి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. దీక్షకు ముందు ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Read also: ఆలస్యంగా వచ్చిందని వంద గుంజీలు తీయించిన టీచర్.. ప్రాణం విడిచిన బాలిక
గాంధీ ఆశ్రమంలో దీక్ష: పీకే ప్రస్థానం
ప్రశాంత్ కిశోర్(Bihar Results) రాజకీయ ప్రస్థానంలో ఈ భితిహర్వా ఆశ్రమానికి ప్రత్యేక స్థానం ఉంది. మూడేళ్ల క్రితం, తన 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను పీకే సరిగ్గా ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఆ పాదయాత్ర ముగిసిన తర్వాత, గత సంవత్సరం గాంధీ జయంతి రోజున ఆయన జన్ సూరజ్ పార్టీని అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత, తన రాజకీయ ప్రారంభానికి స్ఫూర్తినిచ్చిన అదే గాంధీ ఆశ్రమంలో మౌన దీక్ష చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. గాంధీ సిద్ధాంతాలపై పీకేకున్న నమ్మకాన్ని ఈ దీక్ష మరోసారి చాటిచెప్పింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: