📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Prashant Kishor : 51 మంది అభ్యర్థులతో ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి జాబితా విడుదల

Author Icon By Sudha
Updated: October 9, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు, మాజీ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. అవినీతిపై గళమెత్తిన ప్రశాంత్‌ కిషోర్‌,(Prashant Kishor) క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారు. తొలి జాబితా అభ్యర్థుల్లో 17 శాతం బీసీలు, 16 శాతం ముస్లిం అభ్యర్థులున్నారు.కాగా, ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు కేసీ సిన్హా, కుమ్రార్‌ స్థానం నుంచి జన్ సూరాజ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గతంలో పాట్నా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ఆయన రాసిన పాఠ్యపుస్తకాలు బీహార్‌తోపాటు పలు రాష్ట్రాల్లో పాపులర్‌ అయ్యాయి.

Prashant Kishor : 51 మంది అభ్యర్థులతో ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి జాబితా విడుదల

పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాది వైబీ గిరి, బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గాను, పాట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. మాంఝీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలకు కృషి చేసిన డాక్టర్ అమిత్ కుమార్ దాస్, ముజఫర్‌పూర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) పేరు తొలి జాబితాలో లేదు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్జేడీ బలమైన స్థానం, తేజస్వీ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ నుంచి ఆయన పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.

ప్రశాంత్ కిషోర్ ఎవరు?

ప్రశాంత్ కిషోర్వ్యా వహారికంగా PK అని పిలుస్తారు , ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ రాజకీయ వ్యూహకర్త . ఆయన ఐక్యరాజ్యసమితి నిధులతో కూడిన కార్యక్రమంలో ఎనిమిది సంవత్సరాలు ప్రజారోగ్యంలో పనిచేశారు , తరువాత భారత రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు.

ప్రశాంత్ కిషోర్ రాజకీయ జీవితం ?

కిషోర్ బిజెపి , జెడి(యు) , ఐఎన్‌సి , ఆప్ , వైఎస్‌ఆర్‌సిపి , డిఎంకె మరియు టిఎంసి వంటి అనేక రాజకీయ పార్టీలకు విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు . 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ముఖ్యమంత్రి పదవికి తిరిగి ఎన్నికయ్యేలా సహాయం చేయడం ఆయన మొదటి ప్రధాన రాజకీయ ప్రచారం. అయితే, ఆయన భావించిన ఎన్నికల ప్రచార సంస్థ అయిన సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) పూర్తి మెజారిటీని సాధించడంలో సహాయపడినప్పుడు ఆయన విస్తృత ప్రజా దృష్టిని ఆకర్షించారు .

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bihar Politics Breaking News Jan Suraaj latest news Lok Sabha Elections political strategy Prashant Kishor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.